ETV Bharat / entertainment

శ్రీలీలతో నితిన్ కొత్త సినిమా.. కూలీగా మారిన సాయిపల్లవి - saipallavi latest news

మిమ్మల్ని పలకరించేందుకు కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో హీరో నితిన్​ కొత్త సినిమా, కూలీగా మారి హీరోయిన్ సాయిపల్లవి చేసిన పనుల సంగతులు ఉన్నాయి.

nithin
నితిన్​
author img

By

Published : Apr 3, 2022, 1:32 PM IST

Nithin sreeleela movie: త్వరలోనే 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో నితిన్ తన తదుపరి సినిమాను ప్రకటించేశారు. ​ అనుకున్నట్లే ప్రచారంలో ఉన్న యువ కథానాయిక శ్రీలీలను హీరోయిన్​గా ఎంపిక చేశారు. 'నితిన్​ 32'తో అనే వర్కింగ్​ టైటిల్​ రూపొంతున్న ఈ మూవీకి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఇక ఈ సినిమాకు హరీశ్​ జయరాజ్​ సంగీతం అందించనున్నారు.

NIthin sreeleela new movie announced
నితిన్ శ్రీలీల జంటగా కొత్త చిత్రం

Saipallavi as farmer: తెలుగు, తమిళం, మలయాళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఓ నటి కూలీగా మారి పొలంలోకి అడుగుపెట్టారు. దీంతో అక్కడే ఉన్న మహిళా కూలీలందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ నటి ఎవరంటే.. సాయిపల్లవి. 'ప్రేమమ్‌'తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ నేచురల్‌ బ్యూటీ 'భానుమతి సింగిల్‌ పీస్‌' అంటూ తెలుగు వారికి చేరువై ఇక్కడి వారినీ 'ఫిదా' చేసింది. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ.. తనకు నప్పే కథలు మాత్రమే ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇటీవల ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో అలరించిన సాయి ప్రస్తుతం షూట్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె రైతుగా అవతారమెత్తి వ్యవసాయ పనులు చేశారు. మిగతా కూలీలతో కలిసి పంట కోత పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఫొటోలను సాయిపల్లవి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన పలువురు తారలు ఆమెను మెచ్చుకుంటున్నారు.

saipallavi
కూలీగా మారిన సాయిపల్లవి

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్​ కలెక్షన్స్'​.. తొమ్మిదో రోజూ ఆగని జోరు.. ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.