Pawankalyan Saidharam tej movie: తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన 'వినోదయ చిత్తం' సినిమాను తెలుగులో పవన్‌కల్యాణ్ రీమేక్ చేయనున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇందులో సాయితేజ్ కూడా నటిస్తున్నారని వినిపిస్తోంది. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ చిత్రంలో హీరోయిన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. హాట్ అండ్ యాంగ్ బ్యూటీ కేతీక శర్మను ఫైనల్ చేశారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికార ప్రకటన చేయడం సహా నటీనటుల వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. కాగా, ఈ రీమేక్ షూటింగ్ జులైలో ఆరంభించి త్వరగా పూర్తిచేస్తారని సమాచారం. పవన్‌కల్యాణ్ 20 రోజుల పాటు డేట్స్ కేటాయించడం సహా ఏకంగా 50కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని అంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాని మాతృకలో తెరకెక్కించిన సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వం వహించనున్నట్టు వినికిడి. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు సమకూరుస్తున్నారట.
Nithin 20years: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ, తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న యువ కథానాయకుడు నితిన్. 'జయం'తో కెరీర్ మొదలు పెట్టిన ఆయన తాజాగా తన సినీ ప్రయాణంలో 20ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు, తనతో పనిచేసిన దర్శక-నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
"ప్రియమైన స్నేహితులారా.. 'జయం' సినిమాతో 20ఏళ్ల కిందట నా సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాను. దీన్ని ఎలా వర్ణించాలో కూడా మాటలు రావటం లేదు. ఒక నటుడిగా నన్ను గుర్తించి, 'జయం'లో అవకాశం ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నా. అలాగే నా సినీ ప్రయాణంలో అండగా నిలిచిన దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, వ్యక్తిగత సిబ్బంది.. ఇలా నాతో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో. అంతేకాదు, ఈ అందమైన ప్రయాణంలో ఎంతోమంది నాకు అండగా నిలిచారు. కెరీర్ కుదుపులకు లోనైనప్పుడు ఎంతో సహకరించారు. ఇన్నేళ్ళుగా నన్ను అభిమానిస్తూ, నాపై నమ్మకాన్ని ఉంచి నా వెన్నంటే ఉంటూ వచ్చిన అభిమానులకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను" అని నితిన్ తన 20 ఏళ్ల జర్నీపై భావోద్వేగ పోస్ట్ చేశారు. ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలో నటిస్తున్నారు. ఎం.ఎస్.రాజశేఖర్‌రెడ్డి దర్శకుడు. కృతిశెట్టి కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: అభిమానుల మనసు దోచుకున్న రష్మిక