ETV Bharat / entertainment

'స్వయంభూ' కోసం నిఖిల్​ ప్రాక్టీస్​​ - కత్తిసాము సూపర్​గా చేస్తున్నారుగా! - స్వయంభూ మూవీ డైరెక్టర్​

Nikhil Swayambhu Movie : టాలీవుడ్ హీరో నిఖిల్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'స్వయంభూ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఇన్​స్టా వేదికగా నిఖిల్ ఓ వీడియోను షేర్​ చేశారు. అందులో కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఆ వీడియో మీరు ఓ లుక్కేయండి..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 6:58 PM IST

Nikhil Swayambhu Movie : 'హ్యాపీడేస్'​ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన స్టార్ హీరో నిఖిల్​ ప్రస్తుతం వరుస ఆఫర్లలో సందడి చేస్తున్నారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు పొందిన ఈ స్టార్.. తాజాగా 'స్వయంభూ' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్​ ఓ వారియర్​ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే దీని కోసం ఆయన తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.

దాదాపు మూడు నెలలపాటు ఈ యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోను ఫ్యాన్స్​ కోసం సోషల్ మీడియాలో షేర్​ చేశారు. అందులో నిఖిల్​ పదునైన కత్తిని పట్టుకుని తీవ్రంగా ప్రాక్టీస్​ చేస్తున్నారు. "లెఫ్ట్​ హ్యాండ్, రైట్​ హ్యాండ్ .. మోర్​ ప్రాక్టీస్​" అంటూ ఓ క్యాప్షన్​ను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్​ అవుతోంది. ఫ్యాన్స్ కూడా 'నీ డెడికేషన్​కు హ్యాట్సాఫ్ అన్నా'​ అంటూ నిఖిల్​ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Nikhil Upcoming Movies : నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతున్న చిత్రమిది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా కాగా ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. 'సలార్​'కు మ్యూజిక్​ అందిస్తున్న రవి బస్రూర్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మనోజ్‌ పరమహంస ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మల్లు బ్యూటీ సంయుక్త మేనన్​ ఈ సినిమాలో ఫీమేల్​ లీడ్​గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్.. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఆయన గెటప్, మేకోవర్ కొత్తగా ఉందంటూ ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాతో పాటు 'ది ఇండియా హౌస్​' అనే మరో సినిమాలో నిఖిల్​ లీడ్​ రోల్​ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా హిస్టారిక్​ నేపథ్యంలో సాగనుంది.

2024 Pan India Movies : టాలీవుడ్​ నుంచి ఆ 5 సినిమాలు ఒకే.. కానీ ఇవి మాత్రం కాస్త డౌటే!

Nikhil Spy Movie : 'ఆ కారణంతోనే 'స్పై' మూవీ ఫ్లాప్​'.. హీరో నిఖిల్​ షాకింగ్​ కామెంట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.