Niharika Konidela Instagram Re Entry: 'మెగా డాటర్' నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'మెగా' ట్యాగ్‌తో నిహారిక యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. 'ఢీ' షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నవ్వు, చలాకీ మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక నాగశౌర్య హీరోగా 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. అనంతరం చేసిన 'సూర్యకాంతం' కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. సినిమాలలో అంత సక్సెస్ రాకపోయినా.. నిర్మాతగా మాత్రం ముందుకెళ్తున్నారు నిహారిక. తెలుగు వెబ్ సిరీస్ 'ముద్దపప్పు ఆవకాయ్'ను నిర్మించారు. ఈ సిరీస్ యూట్యూబ్‌లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. 2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు చేయకపోయినా వెబ్ సిరీస్‌లలో నటిస్తానని.. సినిమాలు నిర్మిస్తానని గతంలోనే ఆమె తెలిపారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నిహారిక.. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ, పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఇటీవలే జిమ్‌లో షేర్ చేసిన ఓ వీడియోపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దాంతో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన మెగా డాటర్.. సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేశారు. ఇక పబ్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. దాంతో చాలా రోజులు ఇంటికే పరిమితమైన నిహారిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ అయింది. 8 వారాల్లో తాను మూడు పాఠాలు నేర్చుకున్నానంటూ పోస్ట్ చేశారు.
నిహారిక నేర్చుకున్న మూడు పాఠాలు ఇవే:
# ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.
# ఇతరులు ఏం చేస్తున్నారన్నది అసలు పట్టించుకోను.
# ఇప్పుడు నేను రీఫ్రెష్ అయ్యాను.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి: శ్రీముఖి ఈద్ ట్రీట్.. కళ్లు చెదిరేలా అందాలు!