ETV Bharat / entertainment

NBK 109లో ఐటమ్​ సాంగ్​ పక్కా!- బాలయ్య సరసన 'స్వింగ్​జర' బ్యూటీ!! - బాలకృష్ణ కొత్త సినిమాలు

NBK109 Balakrishna Tamannaah : నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్​బీకే 109'. అయితే ఈ సినిమాలో ప్రత్యేక పాట కోసం దర్శకుడు మిల్కీ బ్యూటీని సంప్రదించినట్లు సమాచారం.

NBK109 Balakrishna Tamannaah
NBK109 Balakrishna Tamannaah
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 12:55 PM IST

NBK109 Balakrishna Tamannaah : నందమూరి నటసింహం బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో ఫుల్​ జోష్​ మీద ఉన్నారు. ఇదే జోష్​తో తన కొత్త సినిమా షూటింగ్ బిజీగా ఉన్నారు బాలయ్య. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ దర్శకత్వంలో ఎన్​బీకే 109 వర్కింగ్ టైటిల్​తో సినిమా రూపొందనుంది. ఈ సినిమా ఫుల్ మాస్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్​తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో సరికొత్త లుక్‌తో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో బాలయ్య అభిమానులకు పండగే అని చెప్పాలి.

మిల్కీ బ్యూటీతో ఐటమ్ సాంగ్!
అయితే బాబీ తీసే ప్రతి సినిమాలోను మాస్​ ప్రేక్షకులకు కోసం ఓ రేంజ్​లో మసాలా ట్రీట్​ ఇవ్వటం మనం చూస్తూనే ఉంటాం. వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటే ఏ రేంజ్​లో సందడి చేశాడో మనకు తెలిసిందే. ఇప్పుడు బాలయ్య సినిమా కోసం కూడా అదే రేంజ్ లో ఓ మసాలా ఐటమ్ సాంగ్​ను రెడీ చేస్తున్నారు బాబీ.

గతంలో ఎన్టీఆర్​తో బాబీ జై లవకుశ సినిమాను రూపొందించారు. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్‌, తమన్నా చేసిన స్వింగ్ జర ఐటమ్ సాంగ్‌ ఏ రేంజ్​లో హిట్ అయింది. ఇప్పటికి కూడా ఆ పాట ఎక్కడో ఒక చోట వినిపిస్తూ కనిపిస్తూనే ఉంటుంది. అంతటి సక్సెస్‌ అయిన స్వింగ్‌ జర పాట బ్యూటీని ఇప్పుడు బాబీ తాను రూపొందిస్తున్న బాలయ్య సినిమా కోసం తీసుకువచ్చేందుకు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. బాలయ్యతో ప్రత్యేక పాట చేసేందుకు తమన్నా ఓకే చెప్పిందని సమాచారం.

ఇక సినిమా విషయానికొస్తే సితార బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెలలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభించారు. అయిన కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా హీరోయిన్, ప్రత్యేక పాట విషయంలో అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి బాలయ్య ఫ్యాన్స్ కోసం డైరెక్టర్​ బాబీ సమ్​థింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరేం జరుగుతందో చూడాలి.

​ NBK 109 బిగ్ అనౌన్స్​మెంట్ - 'బాలయ్య' యాక్షన్ షురూ

బాలకృష్ణ సినిమాలో దుల్కర్ సల్మాన్​- ఆ డైరెక్టర్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.