ETV Bharat / entertainment

బాలయ్య-చరణ్​-విజయ్..​ దేనికి జై కొడతారో? - విజయ్​ వంశీ పైడిపల్లి సినిమా టైటిల్​

పేరులోనేముంది? అని తేలికగా తీసిపారేయడానికి వీల్లేదు. అందులోనే సగం ఆకర్షణ శక్తి ఉంది. కథకి తగ్గట్టుగా... పలకడానికి వీలుగా... ఆకర్షణీయంగా... ట్రెండీగా... కొత్తదనం ఉట్టిపడేలా... ఇలా పలు కోణాల్లో ఆలోచించి పేరుపై ఓ నిర్ణయం తీసుకొంటుంటారు సినీ రూపకర్తలు. పేరు ఖరారు చేయడం మొదలుకొని... విడుదల వరకు ఏ అంశాన్నీ వదలకుండా ప్రతి విషయంపైనా ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలంటే ఆ మేరకు కసరత్తులు తప్పవు మరీ! ముఖ్యంగా పేరు గురించి ఓ స్థాయి మేథోమధనమే సాగుతుంటుంది. ఇప్పుడు తెలుగు చిత్రసీమలో పలు సినిమాలు పేర్లు పక్కా చేసుకునే దశలో ఆ కసరత్తు చేస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

balakrishna ramcharan
బాలకృష్ణ రామ్ చరణ్​
author img

By

Published : Jun 18, 2022, 6:34 AM IST

కొన్ని సినిమాలకి పేర్లు ముందే ఖరారవుతుంటాయి. పేరుతోనే సినిమాని ప్రకటించే దర్శకులు కొద్దిమంది ఉంటారు. పూరి జగన్నాథ్‌ అందులో ఒకరు. విజయ్‌ దేవరకొండతో ఆయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకి 'జనగణమన' అనే పేరుని ఖరారు చేశారు. కొబ్బరికాయ కొట్టినరోజే టైటిల్‌ లోగోని చూపించేశారాయన. కొన్ని సినిమాలేమో భిన్నంగా చిత్రీకరణ దశలో కానీ పేరు పక్కా చేసుకోవు. అలాంటి వాటికి బోలెడన్ని పేర్లు ప్రచారంలోకి వస్తుంటాయి. పేరు గురించి చర్చని లేవనెత్తు తుంటాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. సెట్స్‌పై ఉన్న ఒకొక్క సినిమాకి రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి.

దేనికి జై కొడతారో?.. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవలే విడుదల చేశారు. పేరు ఖరారు కాలేదు. అయితే ప్రచారంలో మూడు టైటిళ్లు ఉన్నాయి. 'జై బాలయ్య', 'జై సింహారెడ్డి', 'అన్నగారు' అనే పేర్లు వినిపించాయి. మరి చిత్రబృందం దేనికి జై కొడుతుందో! ఇందులో బాలకృష్ణ ఓ పాత్రలో జై అనే పేరుతో కనిపిస్తారని సమాచారం. మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జులైలోనే షురూ కానుంది. ఈ సినిమా పేరు గురించి అప్పుడే చర్చ మొదలైంది. త్రివిక్రమ్‌ సినిమాల పేర్లు ఎక్కువగా ‘అ’ అక్షరంతోనే మొదలవుతుంటాయి. ఈసారి ఆయన అదే సెంటిమెంట్‌ని అనుసరించే అవకాశాలున్నాయనేది ఫిల్మ్‌నగర్‌ వర్గాల మాట.

అధికారి... వారసుడు?.. విజయ్‌ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పేరుపై ఇటు తెలుగులోనూ, అటు తమిళనాట ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 'వారసుడు' అని గట్టిగా వినిపిస్తోంది. మరి దీన్ని ఖరారు చేస్తారా? లేక మరొకటా? అనేది త్వరలోనే తేలనుంది. విజయ్‌ - రష్మిక మందన్న జోడీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నిర్మాణంలోనే తెరకెక్కుతున్న శంకర్‌ - రామ్‌చరణ్‌ సినిమా విషయంలోనూ పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. 'విశ్వంభర' మొదలుకొని 'సర్కారోడు' వరకు రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా 'అధికారి' అనే పేరు తెరపైకొచ్చింది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఆ పాత్రకి, కథకి తగ్గట్టుగా 'అధికారి' అనే పేరైతేనే బాగుంటుందని, దానిపైనే చిత్రబృందం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇందులో రామ్‌చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలూ పాన్‌ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి.

ఇదీ చూడండి: సైలెంట్​గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్​ భామ.. వెడ్డింగ్​ ఫొటోలతో సర్​ప్రైజ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.