ETV Bharat / entertainment

శ్రుతిహాసన్​తో బాలయ్య సెల్ఫీ, స్టైల్​​ అదిరిందిగా - ఎన్​బీకే 107 బాలకృష్ణ శ్రుతిహాసన్​ సెల్ఫీ

టాలీవుడ్​ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ ఎన్​బీకే 107. ప్రస్తుతం​ ఈ సినిమా షూటింగ్​ విదేశాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా బాలయ్య, శ్రుతిహాసన్​తో డైరెక్టర్ గోపీచంద్​​ కలిసి దిగిన ఓ సెల్ఫీ సోషల్ ​మీడియాలో వైరల్​గా మారింది.

Balakrishna Shrutihassan Selfie
Balakrishna Shrutihassan Selfie
author img

By

Published : Aug 30, 2022, 2:51 PM IST

Balakrishna Shrutihassan Selfie: 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత హీరో బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'ఎన్​బీకే 107' మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమా విడుదల ఎప్పుడవుతుందా అని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్​ విదేశాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్​ గోపీచంద్​ మలినేని పోస్ట్​ చేసిన ఓ సెల్ఫీ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ సెల్ఫీలో బాలకృష్ణ అదిరిపోయే లుక్​లో కనిపించారు. హీరోయిన్​ శ్రుతి హాసన్​ కూడా బ్లాక్​ అవుట్​ఫిట్​లో తన అందంతో ఆకట్టుకుంటున్నారు.

balakrishna trio selfie
బాలకృష్ణ, శ్రుతి హాసన్​, గోపిచంద్​ మలినేని సెల్ఫీ

బాలయ్య కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. దునియా విజయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా, సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు రచిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి: ఆస్కార్​ చెంప దెబ్బ ఎఫెక్ట్​, మళ్లీ ట్రెండింగ్​లోకి స్టార్​ నటుడు

ఈ వారమే విక్రమ్​ కోబ్రా, ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.