ETV Bharat / entertainment

నయన్, విఘ్నేశ్​ను విచారణకు పిలుస్తాం : తమిళనాడు ఆరోగ్య మంత్రి

author img

By

Published : Oct 14, 2022, 9:47 PM IST

నయనతార, విఘ్నేశ్​ శివన్​ సరోగసీ పిల్లల వివాదం ఇంకా ముదురుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి.. అవసరమైతే వారిద్దరిని విచారణకు పిలుస్తామని చెప్పారు.

Nayan Vignesh called for investigation
Nayan Vignesh called for investigation

ప్రముఖ నటి నయనతార కష్టాల్లో పడింది. ఇటీవల సరోగసీ ద్వారా నయన్, విఘ్నేశ్​ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే సరోగసీ విధానంలో పిల్లల్ని కనడం నిబంధనలకు లోబడే జరిగిందా అనే సందేహాలు తలెత్తాయి. దీంతో చాలా మంది ఈ జంటను ప్రశ్నించారు. ఈ విషయం ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎమ్ సుబ్రమణియన్ దాకా వెళ్లింది. స్పందించిన మంత్రి రాష్ట్ర ఆరోగ్య విభాగం జాయింట్ డైరక్టర్​ అధ్యక్షతన నలుగురు సభ్యులతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు.

అయితే తాజాగా ఈ విషయమై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సుబ్రమణియన్ స్పందించారు. నయన్​, విఘ్నేశ్​ శివన్​లు కవల పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఆస్పత్రిని దర్యాప్తు బృందం కనుక్కుందని తెలిపారు. ఈ విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్నామని ఆరోగ్య విభాగం జాయింట్​ డైరక్టర్ ఏ విశ్వనాథన్​ పేర్కొన్నారు.

విఘ్నేశ్​, నయన్ సరోగసీ విషయంలో ఏమైనా అక్రమాలు జరిగాయా? అనే దానిపై త్వరలోనే నివేదిక రానుంది. ఇంకా ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారా? అనే దానిపై వారంలోపు నివేదిక సమర్పించనున్నారు. అయితే ఈ విషయంలో అవసరమైతే నయన్, విఘ్నేశ్​ను విచారణకు పిలుస్తామని మంత్రి సుబ్రమణియన్​ తెలిపారు.

ఇవీ చదవండి: నాగచైతన్య మూవీలో వంటలక్క.. ఈ సినిమాతోనే వెండితెర అరంగేట్రం

'చంద్రముఖి' కానున్న 'చందమామ'.. ప్రారంభం కానున్న ప్రభాస్ కొత్త చిత్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.