కోలీవుడ్ ట్రెండింగ్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్ శుభవార్త చెప్పారు. పండంటి కవలలకు తల్లిదండ్రులమైనట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వీరికి అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సరోగసీ పద్ధతిలో వీరు కవలలకు తల్లిదండ్రులైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబసభ్యుల సమక్షంలో మహాబలిపురంలో జూన్ 9న పెళ్లి బంధంతో ఏకమయ్యింది.


మహాబలిపురంలో అంబరాన్ని అంటేలా ఓ సుందరమైన పెళ్లి వేదికలో జరిగిన ఈ కళ్యాణ వేడుక డాక్యుమెంటరీ రూపంలో త్వరలోనే నెట్టింట్లో సందడి చేయనుంది. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్' అనే టైటిల్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీ కోసం వేచి చూస్తున్న అభిమానులకు నిజంగా ఈ జంట మంచి న్యూసే చెప్పింది. దసరాకు విడుదలైన 'గాడ్ ఫాదర్'తో విజయాన్ని అందుకున్న నయన్. 'కాతువాకుల రెండు కాదల్'’తో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విఘ్నేశ్‌తో తదుపరి అజిత్ సరసన ఓ సినిమా చేయనున్నారని ప్రకటించారు..


ఇదీ చదవండి: 'నువ్వే నువ్వే'కు 20 ఏళ్లు.. ఈ డైలాగ్స్ ఇప్పటికీ బ్లాక్బస్టర్లే..!