ETV Bharat / entertainment

నయన్​-విఘ్నేశ్ పెళ్లి కన్ఫామ్​​.. సీఎంకు ఆహ్వాన పత్రిక - నయన్​తార విఘ్నేశ్​ పెళ్లి తేదీ

Nayanthara marriage: హీరోయిన్​ నయనతార-దర్శకుడు విఘ్నేశ్​ తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

Nayantara Vignesh marriage
నయన్ విఘ్నేశ్ పెళ్లి
author img

By

Published : Jun 5, 2022, 12:21 PM IST

Nayanthara marriage: లేడీ సూపర్‌స్టార్‌ నయనతార త్వరలోనే తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడా వార్తలకు ఈ జోడీ చెక్​ పెట్టారు. తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరారు. సీఎం వీరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

సుమారు ఏడేళ్ల నుంచి నయన్‌-విఘ్నేశ్‌ ప్రేమలో ఉన్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది ఈ జంట నిశ్చితార్థం జరిగింది. మహాబలిపురంలోని మహబ్‌ హోటల్‌లో జూన్‌ 9న ఈ పెళ్లి జరగనుంది. ఇక, సినిమాల విషయానికి వస్తే నయన్‌ కథానాయికగా నటించిన 'కాతువక్కల రెందు కాదల్‌' చిత్రానికి విఘ్నేశ్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నయన్‌.. చిరుతో 'గాడ్‌ ఫాదర్‌', పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో 'గోల్డ్‌', షారుఖ్‌ ఖాన్‌తో 'జవాన్‌'.. అలాగే కోలీవుడ్‌లో 'ఓ 2', 'కనెక్ట్‌' చిత్రాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: శార్వరి వా​.. సోకుల గాలం వేస్తూ.. సోషల్​మీడియాలో కేక పుట్టిస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.