ETV Bharat / entertainment

నజ్రియాతో నాని సతీమణి డ్యాన్స్‌.. తెగ వైరల్​ అవుతున్న వీడియో - నజ్రియా

Nani Wife Dance with Nazriya: నేచురల్​ స్టార్​ నాని సతీమణి అంజనతో కలిసి క్యూట్ హీరోయిన్ నజ్రియా చేసిన ఓ డాన్స్​ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. వారితో కలిసి చివర్లో నాని కూడా చిందులేశారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

ante sundaraniki
nazriya nani movie
author img

By

Published : Jun 9, 2022, 4:03 PM IST

Nani Wife Dance with Nazriya: సుందరం, లీలాగా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యారు నటుడు నాని, నటి నజ్రియా. వీరు జంటగా నటించిన చిత్రం 'అంటే సుందరానికీ..!'. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడితే.. తమ వివాహానికి పెద్దల్ని ఒప్పించడానికి ఆ జంట పడిన పాట్లను ఫన్నీగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నాని, నజ్రియా వరుస ఇంటర్వ్యూలతో బిజీ షెడ్యూల్‌ గడుపుతున్నారు. ఏ కాస్త సమయం దొరికినా సోషల్‌మీడియాలోనూ 'అంటే సుందరానికీ..!' చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.

ante sundaraniki
నజ్రియా

కాగా, తాజాగా నజ్రియా షేర్‌ చేసిన ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ఆమె 'అంటే సుందరానికీ..!' ప్రమోషనల్‌ సాంగ్‌కి నాని సతీమణి అంజనతో కలిసి స్టెప్పులేశారు. వీడియో చివర్లో నాని కూడా వీరితో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశారు. నాని, అంజనతో కలిసి రీల్‌ చేయడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన పలువురు సెలబ్రిటీలు.. "వావ్‌.. సో క్యూట్‌" అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ హీరోలతో నటించాలని ఉంది: నజ్రియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.