ETV Bharat / entertainment

ఇక ఆ సినిమాల జోరు.. వేసవి సీజన్​ను మరిపించేలా! - గాడ్సే

తెలుగు సినిమా వేసవి సీజన్‌ దాదాపుగా పూర్తయినట్టే! అంచనాలున్న సినిమాలు.. అగ్ర తారల చిత్రాలు కొన్ని నెలలుగా పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఫలితాలు మిశ్రమంగానే వచ్చాయి. బాక్సాఫీసు లెక్కలు, రికార్డుల మాటలెలా ఉన్నా.. రానున్న సినిమాల వరుస చూస్తుంటే వేసవిని మించి మరో సీజన్‌ ముందుందని స్పష్టమవుతోంది. మధ్య స్థాయి బడ్జెట్‌తో కూడిన సినిమాలు, యువ కథానాయకుల చిత్రాలు ఈ నెల నుంచే వరుసకడుతున్నాయి.

movies releasing in june 2022
nani
author img

By

Published : Jun 4, 2022, 7:38 AM IST

'మేజర్‌', 'విక్రమ్‌' సినిమాలతో జూన్‌ నెల ఘనంగా మొదలైంది. హిందీ నుంచి 'పృథ్వీరాజ్‌' వచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలోనే ఈ చిత్రాలూ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటి తర్వాత వారం వారం సినిమాలు పోటీ పడుతున్నాయి. సాధారణంగా జూన్‌ ప్రథమార్థం తర్వాత కొత్త సినిమాల జోరుకి బ్రేక్‌ పడుతుంటుంది. స్కూళ్లు, కళాశాలలు తెరిచే సమయం కాబట్టి విడుదలలు తగ్గుతుంటాయి. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనాతో ఎప్పట్నుంచో విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమాలు ఇకపై వరుసగా రానున్నాయి. ఈ నెలలో నాని, రానా, సుమంత్‌ అశ్విన్‌, సత్యదేవ్‌ తదితరుల చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

  • ఆవకాయ సీజన్‌ అంటూ ఎప్పట్నుంచో ఊరిస్తూ వచ్చిన చిత్రం 'అంటే.. సుందరానికీ'. నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. నజ్రియా తెలుగులో నటించిన తొలి చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది. ఈ నెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
  • ఇదే నెలలోనే రానా దగ్గుబాటి సినిమాలూ సందడి చేస్తున్నాయి. ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న '777 ఛార్లి' ఈ నెల 10నే విడుదలవుతోంది. 'శ్రీమన్నారాయణ' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన రక్షిత్‌ శెట్టి కథానాయకుడిగా, కిరణ్‌రాజ్‌ కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఓ కుక్కపిల్ల కీలక పాత్ర పోషిస్తోంది.
  • ఈ సినిమా తర్వాత వారం రోజులకి రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటించిన 'విరాటపర్వం' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రేమ, విప్లవం చుట్టూ సాగే కథతో యువ దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రమిది. సాయిపల్లవి కథానాయికగా నటించారు. 'మేజర్‌', 'విక్రమ్‌' తర్వాత వస్తున్న ఈ మూడు సినిమాల ఫలితాలు బాక్సాఫీసుకి కీలకం కానున్నాయి.

యువకుల సందడి: యువ కథానాయకులు సుమంత్‌ అశ్విన్‌, సత్యదేవ్‌, కిరణ్‌ అబ్బవరం చిత్రాలూ ఈ నెలలోనే సందడి చేస్తాయి. సత్యదేవ్‌ కథానాయకుడిగా నటించిన 'గాడ్సే' ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. గోపి గణేష్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ నిర్మించిన చిత్రమిది. సమకాలీన అంశాల్ని ప్రతిబింబించే కథతో ఈ సినిమాని తెర కెక్కించినట్టు చిత్రవర్గాలు చెబుతున్నాయి.

యువతరాన్ని అలరించిన 'డర్టీ హరి' తర్వాత ఎమ్‌.ఎస్‌.రాజు తెరకెక్కించిన చిత్రం '7 డేస్‌ 6 నైట్స్‌'. సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడిగా నటిస్తూ రజనీకాంత్‌.ఎస్‌తో కలిసి నిర్మించారు. యువతరంతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా సునిశితమైన కథాంశంతో తెరకెక్కించామని ఎమ్‌.ఎస్‌.రాజు చెబుతున్నారు. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

కిరణ్‌ అబ్బవరం, చాందిని చౌదరి జోడీగా నటించిన 'సమ్మతమే' జూన్‌ 24నే ప్రేక్షకుల ముందుకొస్తోంది. రొమాంటిక్‌ వినోదంతో రూపొందిన ఈ చిత్రాన్ని గోపీనాథ్‌రెడ్డి తెరకెక్కించారు. మధ్య స్థాయి బడ్జెట్‌ సినిమాల సీజన్‌ని ఆరంభిస్తున్న ఈ నెలలో పలు ఆకర్షణలే ఉన్నాయి. ప్రేక్షకుడు వినోదంలో తడిసి ముద్దవడమే ఆలస్యం అంటోంది చిత్రసీమ.

ఇదీ చూడండి: 'మనం తగ్గి సినిమాను ఎలివేట్​ చేస్తే ఆ కిక్కే వేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.