ETV Bharat / entertainment

Nani Hai Nanna : నాని దెబ్బకు.. బాక్సాఫీస్ ముందు కొత్త వార్​.. ఆ ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గుతారో? - విశ్వక్​ సేన్ గ్యాంగ్​ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్​

Nani Hai Nanna Release Date : నేచురల్ స్టార్ నాని హాయ్​ నాన్న సినిమా రిలీజ్​ డేట్​ అనౌన్స్ చేయడంతో బాక్సాఫీస్​ ముందు కొత్త పోటీ మొదలైనట్టైంది. నాని దెబ్బకు ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు వెనక్కి తగ్గే అవకాశముందని తెలుస్తోంది. ఆ వివరాలు..

Nani Hai Nanna : నాని దెబ్బకు.. బాక్సాఫీస్ ముందు కొత్త వార్​.. ఆ ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గుతారో?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 4:37 PM IST

Nani Hai Nanna Release Date : నేచురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా 'హాయ్ నాన్న' టీజర్​ రిలీజ్ అవ్వడంతో పాటు మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చింది. అయితే నిజానికి ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇప్పుడీ చిత్రం ప్రీ పోన్ అయింది. ముందుగా అనుకున్న విడుదల షెడ్యూల్ కన్నా 2 వారాల ముందే రిలీజ్ కానుంది. డిసెంబర్ 7నే థియేటర్లలో ప్రేక్షకలను పలకరిం రానున్నట్లు మేకర్స్​ తెలిపారు.

ప్రభాస్ సలార్​ ఎవరూ ఊహించని విధంగా క్రిస్మస్ బరిలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇతర చిత్రాల విడుదల తేదీలు మారిపోయాయి. ముఖ్యంగా క్రిస్మస్​ పోటీల్లో ఉన్న నాని 'హాయ్​ నాన్న', వెంకటేశ్​ 'సైంధవ్' ప్రీపోన్​-పోస్ట్​పోన్ అయిపోయాయి. సైంధవ్ సంక్రాంతికి వెళ్లిపోగా.. హాయ్​ నాన్న 2 వారాల ముందుగా వచ్చేస్తోంది. అయితే నాని హాయ్​ నాన్న.. డిసెంబర్ 7న రానుండటం వల్ల.. బాక్సాఫీస్​ ముందు మరో కొత్త పోటీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేంటంటే.. ఇప్పటికే ఆ రిలీజ్​ డేట్​కు ఒక రోజు తర్వాత.. మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఆపరేషన్ వాలంటైన్'(Operation Valentine Varun Tej), నితిన్ నటిస్తున్న 'ఎక్స్ ట్రా ఆర్డినరీ'(Nithin Extraordinary Man Movie) వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఈ విషయాన్ని అనౌన్స్ కూడా చేశాయి.

మరి ఇప్పుడేమో.. ఆ సినిమాలకు ఒక రోజు ముందుగానే హాయ్ నాన్న రిలీజ్ అ్యయేందుకు సిద్ధమైంది. దీంతో వరుణ్ తేజ్, నితిన్ చిత్రాల్లో ఒకటి డ్రాప్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఏది డ్రాప్​ అవుతుందో క్లారిటీగా ఇప్పుడే చెప్పలేం. పైగా ఈ పోటీలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Vishwak Sen Gangs Of Godavari) వచ్చి చేరనున్నట్లు కొద్ది రోజుల నుంచి కథనాలు వస్తున్నాయి. చూడాలి మరి డిసెంబర్ 7-8తేదీల్లో హాయ్​నాన్నకు పోటీగా ఏఏ చిత్రాలు వస్తాయో..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Hi Nanna Teaser : డిఫరెంట్ లవ్​ కాన్సెప్ట్​తో 'హాయ్ నాన్నా'.. టీజర్ వచ్చేసింది.. సినిమా ఎప్పుడంటే?

Big boss Bhagvant Kesari : బిగ్ బాస్​లో 'భగవంత్ కేసరి'.. గత 20ఏళ్ల బాలయ్య కెరీర్​లో తొలి సారి అలా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.