ETV Bharat / entertainment

బాక్సాఫీస్​ వద్ద 'దసరా' వసూళ్ల పండగ.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే? - నాని దసరా మూవీ సీడెడ్​ కలెక్షన్స్​

నేచురల్​ స్టార్​ నాని లేటెస్ట్ మూవీ 'దసరా' బాక్సాఫీస్​ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

nani dasara collections
nani dasara first day collections
author img

By

Published : Mar 31, 2023, 10:45 AM IST

నేచురల్ స్టార్​ నాని హీరోగా తెరకెక్కిన 'దసరా' సినిమా గురువారం అట్టహాసంగా రిలీజైంది. శ్రీ రామనవమి సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలోనే కాదు ఓవర్సీస్​లోనూ కాసలు వర్షం కురిపిస్తోంది. అడ్వాన్స్​ బుక్కింగ్స్​లోనే జోరందుకున్న ఈ మూవీ.. పలు థియేటర్ల ముందు హౌస్​ ఫుల్​ బోర్డ్​లు పడేలా చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900కి పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ డే కలెక్షన్లు ఇప్పుడు నెట్టింట హాట్​టాపిక్​గా మారాయి. నైజాంలో మొదటి రోజే రూ. 6.78 కోట్లు మేర వసూలు చేసిందట. ఇక ఏపీ విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో 1.25 కోట్లు, గుంటూరులో 1.1కోట్లు, ఈస్ట్ గోదావరిలో 0.87 కోట్లు, కృష్ణాలో 0.62 కోట్లు, పశ్చిమ గోదావరి 0.54 కోట్లు, నెల్లూరు 0.34 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మరోవైపు యూఎస్​లో కూడా మొదటి రోజు 73,168 డాలర్లు మేర కలెక్ట్ చేసిందట.

ఇక సినిమా విషయానికి వస్తే.. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది. నేచురల్​ స్టార్​ నాని ఈ సినిమాలో ఊరమాస్​ లుక్​లో దర్శనమిచ్చారు. ధరణీ అనే పాత్రలో ఒదిగిపోయి యాక్టింగ్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. వెన్నెలగా కీర్తి సురేశ్​ యాక్టింగ్​ కూడా అదిరిపోయింది. దీక్షిత్​ శెట్టి, సముద్ర ఖని, సాయి కుమార్​, టామ్​ చాకో లాంటి స్టార్​ నటులు తమ నటనతో సినిమాను ఓ రేంజ్​లోకి తీసుకెళ్లారు. దర్శకుడు శ్రీకాంత్​ ఓదెలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ తన దర్శకత్వ ప్రతిభతో అందరినీ అబ్బురపరిచారు. మ్యూజిక్​ డైరెక్టర్​ సంతోష్​ నారయణన్​ మ్యూజిక్​ ఈ సినిమాకు హైలైట్​గా నిలిచింది. సినిమాలోని సాంగ్స్​ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

రిలీజ్‌కు ముందు నుంచే టీజర్​, ట్రైలర్​తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నాని కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాగా దసరా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా మాసివ్​ సక్సెస్​ కోసం ఎదురుచూస్తున్న నానికి 'దసరా' సినిమాతో ఆ కల నెరవేరింది. ముఖ్యంగా ఇంటర్వెల్‌, క్లైమాక్స్ ఎపిసోడ్​లు సినిమాకు హైలైట్​గా నిలిచాయని అభిమానులు అంటున్నారు​. నాని కెరీర్‌లో ఈ సినిమా కచ్చితంగా ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.