ETV Bharat / entertainment

గ్రాండ్​గా 'దసరా' డైరెక్టర్​ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే? - నాని దసరా సినిమా

'దసరా' సినిమా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల వివాహం చేసుకున్నారు. గోదావరిఖనిలో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆ సంగతులు..

Dasara Director Marriage
గ్రాండ్​గా 'దసరా' డైరెక్టర్​ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
author img

By

Published : May 31, 2023, 10:52 PM IST

Srikanth Odhela Marriage : కొంతమంది డైరెక్టర్స్​.. తమ తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్​ను అందుకుంటారు. తమ ఫస్ట్​ మూవీతోనే సక్సెస్​ను అందుకుని టాక్​ ఆఫ్​ ది ఇండస్ట్రీగా మారుతారు. అలాంటి వారిలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒకరు. నేచురల్​ స్టార్​ నాని నటించిన 'దసరా' సినిమాతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుని.. నాని కెరీర్​లోనే బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది. ఇక ఈ చిత్ర విజయోత్సాహంలో తన బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు శ్రీకాంత్​. మరో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

Srikanth Odela married : గోదావరిఖని వేదికగా.. తన చిన్ననాటి స్నేహితురాలు సౌమ్యకృష్ణను బుధవారం పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది బంధువులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్​గా జరిగింది. దర్శకుడు సుకుమార్‌, జాతిరత్నాలు ఫేమ్​ అనుదీప్‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరై సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే హీరో నాని మాత్రం ఈ వివాహ వేడుకకు హాజరుకాలేకపోయారు. వేరే రాష్ట్రంలో తన కొత్త సినిమా షూటింగ్​లో బిజీగా ఉండడం వల్ల శ్రీకాంత్‌ పెళ్లికి నాని హాజరుకాలేకపోయారని సమాచారం. కానీ ఈ వేడుకకు సంబంధించి నూతన వధూవరుల ఫొటోను హీరో నాని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 'మన శ్రీకాంత్‌ పెళ్లి చేసుకున్నాడు. మీ ఆశీస్సులు పంపండి' అని తన అభిమానులను కోరారు. ఈ పిక్​లో కొత్త జంట చిరునవ్వులు చిందిస్తూ చూడముచ్చటగా కనిపించింది. దీంతో, నూతన దంపతులకు నాని ఫ్యాన్స్​తో పాటు సినీ లవర్స్​ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Nani Dasara movie : కాగా, లెక్కల మాస్టర్​, ప్రముఖ డైరెక్టర్​ సుకుమార్‌ వద్ద 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' సినిమాలకు పనిచేశారు శ్రీకాంత్‌. ఆ తర్వాత 'దసరా' చిత్రంలో డైరెక్టర్‌గా మారారు. నాని, కీర్తిసురేశ్‌, దీక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో నాని మున్నపెన్నడు కనిపించలని లుక్​లో మాస్​గా కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. తెలంగాణలోని సింగ‌రేణి స‌మీపంలో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ నడిచే కథ ఇంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్​ఫామ్​ 'నెట్‌ఫ్లిక్స్‌'లో స్ట్రీమింగ్‌ అవుతోంది. త్వరలోనే తన నెక్ట్స్ మూవీ ప్రకటించనున్నారు శ్రీకాంత్‌.

ఇదీ చూడండి : రూ.100 కోట్ల క్లబ్​లోకి 'దసరా'.. నాని కెరీర్​లో ఫస్ట్​ మూవీగా రికార్డ్​!

టాలీవుడ్​లో ఇప్పుడంతా వారి 'మ్యూజిక్కే' ట్రెండ్.. అంతా అక్కడోళ్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.