ETV Bharat / entertainment

పవర్​ఫుల్​గా నాగార్జున 'ది ఘోస్ట్' ట్రైలర్ - నాగార్జున ది ఘోస్ట్ మూవీ రిలీజ్ డేట్

కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

Nagarjuna The ghost trailer released
పవర్​ఫుల్​గా నాగార్జున 'ది ఘోస్ట్' ట్రైలర్
author img

By

Published : Sep 30, 2022, 4:28 PM IST

అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున ది ఘోస్ట్​ ట్రైలర్​ వచ్చేసింది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కొత్త ట్రైలర్‌లోని సన్నివేశాలు సినిమాలో కీలకంగా నిలిచేవని అర్థమవుతోంది. 'డబ్బు, సక్సెస్‌.. సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది' అనే డైలాగ్‌ అందరినీ మెప్పించేలా ఉంది. మరి, ఇంటర్‌పోల్‌ అధికారులైన హీరో-హీరోయిన్లు తమ ఆపరేషన్‌ పూర్తి చేశారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కాగా, ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తార్‌ తెరకెక్కించారు. వెండితెరపై ఆ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని తెలిపారు. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో నాగ్‌, సోనాల్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. గుల్‌ పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: భరత్‌ - సౌరభ్‌, యాక్షన్‌: దినేష్‌ సుబ్బరాయన్‌, కేచ, ఛాయాగ్రహణం: జి.ముఖేష్‌.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: పాకిస్థాన్ యాక్టర్​తో స్టార్​ హీరోయిన్ రొమాన్స్​​.. వీడియో వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.