ETV Bharat / entertainment

హిట్​ టాక్​తో దూసుకెళ్తున్న 'నా సామిరంగ' - ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే? - నా సామి రంగ రివ్యూ

Nagarjuna Naa Saami Ranga OTT Streaming : అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ'. ఈ సినిమా నేడు విడుదలై హిట్ టాక్​ అందుకున్న నేపథ్యంలో ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్, డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ వివరాలు బయట చక్కర్లు కొడుతున్నాయి.

పాపులర్ ఓటీటీలో నాగార్జున 'నా సామిరంగ' - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 11:16 AM IST

Nagarjuna Naa Saami Ranga OTT Streaming : టాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో నాగార్జున ఒకరు. ఈ టాలీవుడ్ మన్మథుడు ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కింగ్‌గా ఎదిగారు. మొన్నటి వరకు బిగ్ బాస్ 7 తెలుగు సీజన్​తో హోస్ట్​గా అలరించిన ఈ సంక్రాంతికి 'నా సామి రంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే ఈ సంక్రాంతి 2024 బరిలో మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేశ్​ సైంధవ్ చిత్రాలు రిలీజై థియేటర్లలో అలరిస్తుండగా నేడు(జనవరి 14) నాగ్​ తన సినిమాను విడుదల చేశారు.

ఈ చిత్రం(Naa Saami Ranga Review) మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్​ను దక్కించుకుంది. ఘోస్ట్​ వంటి డిజాస్టర్​ తర్వాత ఈ చిత్రం సక్సెస్​తో నాగ్ మళ్లీ కమ్​ బ్యాక్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో నా సామి రంగ ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నా సామిరంగ ఓటీటీ డీల్, పార్టనర్ విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఈ మూవీ ఓటీటీ రైట్స్​ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాను థియేటర్‌లో విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటీటీలోకి విడుదల చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంటే వచ్చే నెల ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి నెలలో నా సామిరంగ సినిమా ఓటీటీలో వస్తుందనమాట.

ఇకపోతే ఈ నా సామిరంగ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారారు. సినిమాకు నాగ్‌కు జోడీగా అమిగోస్ బ్యూటి ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేశ్​, రాజ్ తరుణ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అల్లరి నరేశ్​, రాజ్ తరుణ్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అల్లరి నరేశ్​కు జోడీగా రెండోసారి మిర్నా మీనన్ నటించింది. వీరిద్దరు ఇదివరకే ఉగ్రం చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించారు. జైలర్ సినిమాలోనూ రజనీకాంత్‌కు కోడలుగా మిర్నా మీనన్ నటించి ఆకట్టుకుంది. ఇక రాజ్ తరుణ్‌ సరసన రుక్సార్ దిల్లాన్ నటించింది.

రివ్యూ : కింగ్ ఈజ్ బ్యాక్​ - 'నా సామి రంగ' నాగ్ ర్యాంప్ ఆడిస్తున్నాడు!

'హనుమాన్'​ కలెక్షన్స్​ - రెండో రోజు భారీగా జంప్​ - ఏకంగా ఎన్ని కోట్లంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.