ETV Bharat / entertainment

అందులో నటించనన్న సాయిపల్లవి.. బొమ్మరిల్లు భాస్కర్​తో చైతూ మూవీ! - నాగచైతన్య బొమ్మరిల్లు భాస్కర్​

తాను స్పెషల్​ సాంగ్స్​లో నటించడంపై మాట్లాడింది హీరోయిన్ సాయిపల్లవి. మరోవైపు యువ హీరో నాగచైతన్య మరో కొత్త సినిమాను లైన్​లో పెట్టినట్లు తెలుస్తోంది.

saipallavi nagachaitanya
సాయిపల్లవి నాగచైతన్య
author img

By

Published : May 23, 2022, 7:39 PM IST

Saipallavi special songs: ప్రముఖ నటి సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్​ ప్రారంభం నుంచి వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ టాలెంటెడ్​ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఓ నటిగా తనకు తాను కొన్ని పరిధులు విధించుకుని. గ్లామర్​ పాత్రలకు, ఎక్స్​పోజింగ్​కు ఆమె దూరంగా ఉంటోంది. ఇప్పటివరకు ఏ చిత్రంలోనూ స్కిన్​ షో చేయలేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మకు ఈ విషయమై ప్రశ్న ఎదురైంది. 'పుష్ప' చిత్రంలో 'ఊ అంటావా మామ' పాట, 'రంగస్థలం' సినిమాలో 'జిగేలు రాణి' వంటి స్పెషల్​ సాంగ్స్ లో అవకాశం వస్తే నటిస్తారా? అని అడగగా.. చేయనని స్పష్టం చేశారు. "ఆ సాంగ్స్​ నాకు కంఫర్ట్​గా ఉండవు. అవకాశం వచ్చినా చేయను. వస్త్రధారణ సరిగా లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు. జీవితానికి కెరీర్​ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యం. రెండింటిలో ఏది లేకపోయినా లైఫ్​ సంపూర్ణం కాదు" అని పేర్కొంది.

Nagachaitanya Bommarillu Bhaskar movie: యువ హీరో నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ఇటీవలే 'లవ్​స్టోరీ', 'బంగార్రాజు' చిత్రాలో సక్సెస్​ అందుకున్న ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్ట్​ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఆయన మరో కొత్త సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అఖిల్​తో 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్'​ సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఈ మధ్యే చర్చలు జరిగాయని.. కథ నచ్చి చైతూ ఓకే చెప్పారని టాక్​! 14 రీల్స్ సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా, త్వరలోనే 'లాల్​ సింగ్​ చద్ధా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న చైతూ.. ప్రస్తుతం థ్యాంక్యూ, దర్శకుడు వెంకట్​ ప్రభుతో మూవీ చేస్తున్నారు. మరో డైరెక్టర్​ పరశురామ్​తో ఓ సినిమా చేస్తారని టాక్​. ఇది పూర్తవ్వగానే బొమ్మరిల్లు భాస్కర్​తో కలిసి పనిచేస్తారని సమాచారం.

ఇక విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రం 'థాంక్యూ'. వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ నెల 25న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నట్లు హీరో నాగచైతన్య తెలిపారు. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు

ఇదీ చూడండి: అర్జునుడుగా మహేశ్​.. టీచర్​గా అల్లరినరేశ్​.. ​నాని కష్టాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.