ETV Bharat / entertainment

Dootha webseries : చైతూ 'దూత' ఏమైనట్టు? - ​ నాగచైతన్య దూత వెబ్​సిరీస్ రిలీజ్​ డేట్​

నాగచైతన్య నటించిన 'దూత' వెబ్​సిరీస్​ చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఈ సిరీస్​ విడుదలకు మోక్షం కలగట్లేదు. అసలు దీని పేరు కూడా వినిపించట్లేదు. ఇంతకీ ఆ సిరీస్​ ఏమైనట్టు?

Nagachaitanya Dootha webseries faces struggling in release date
చైతూ 'దూత' ఏమైనట్టు?
author img

By

Published : May 16, 2023, 8:46 AM IST

అక్కినేని యంగ్​ హీరో నాగచైతన్య ప్రస్తుతం కెరీర్​లో వరుసగా ఫ్లాప్​లను ఎదుర్కొంటున్నారు. 'థ్యాంక్యూ', 'లాల్ సింగ్​ చద్ధా' డిజాస్టర్​గా నిలవడం వల్ల ఆయన తన కొత్త సినిమా 'కస్టడీ'పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఈ రిజల్ట్​ విషయాల్ని పక్కన పెడితే.. చైతూ ఈ చిత్రాలన్నింటినీ లైన్​లో పెట్టడంతో పాటు ఓటీటీ డెబ్యూకు కూడా రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే 'దూత' అనే హారర్​ వెబ్​సిరీస్​లోనూ నటించారు. చాలా కాలం క్రితమే ఇది షూటింగ్​ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఇది ఎప్పుడు వస్తుందనే భేతాళ ప్రశ్నకు మాత్రం సమాధానం అస్సలు దొరకడం లేదు. నెలల క్రితమే ఈ వెబ్​సిరీస్​కు సంబంధించి ఓ ఈవెంట్ కూడా జరిగింది. ఇందులో పాత్రలను కూడా పరిచయం చేశారు. అమెజాన్ ప్రైమ్.. ఈ సిరీస్​ను భారీ బడ్జెట్​తో తెరకెక్కించింది.

అయితే ఈ సిరీస్​ రిలీజ్​కు జాప్యం జరగడానికి వెనక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్​ కోసం పాన్​ ఇండియా రేంజ్​లో అన్ని భాషల్లో ప్రమోట్ చేయాలి. దీనికి హీరో, దర్శకుడి ఇమేజ్​తో మార్కెట్​ కూడా కీలకం. అయితే డైరెక్టర్​ విక్రమ్ కుమార్.. 'థాంక్యూ' చిత్రం రిజల్ట్​తో దెబ్బతిని ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం చైతూ మార్కెట్ కూడా కాస్త డల్​గానే ఉంది. 'లాల్ సింగ్ చద్ధా', 'థ్యాంక్యూ'లో ఏదైనా ఒకటి హిట్​ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అది జరగలేదు. దీంతో అమెజాన్.. 'దూత' సిరీస్​ను వాయిదా వేస్తూ వస్తోందని టాక్ నడుస్తోంది.

ఇకపోతే 'దూత' హారర్ జానర్. ఇటువంటి జానర్​కు ఓటీటీలో ప్రేక్షకులు ప్రత్యేకంగా ఉంటారు. అయితే దూత ఫైనల్ ఔట్​పుట్​ పట్ల అమెజాన్ టీమ్ అంత సంతృప్తికరంగా లేదని కూడా అంటున్నారు. అందుకే సిరీస్​లో కొన్ని కీలక మార్పులు చేయాలని అమెజాన్​ రికమండ్ చేసిందని.. వాటిని సరిచేసే పని వల్లే ఆలస్యమవుతోందనే కారణం కూడా వినిపిస్తోంది. మరి ఈ రెండింటిలో ఏ కారణమో సరిగ్గా తెలీదు కానీ.. గతేడాది నుంచి 'దూత' పేరు కూడా వినపడట్లేదు. అసలు ఎవ్వరూ ఆలోచించట్లేదు. మరి ఈ సిరీస్​కు ఎప్పుడు మోక్షం కలుగుతుందో.. కాగా, ఈ 'దూత' సిరీస్​లో ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటించింది. ఇందులో నాగచైతన్య ఇప్పటి వరకూ కనిపించని లుక్‌లో దర్శనమివ్వనున్నారట.

ఇదీ చూడండి: SSMB 28 Title : 'గుంటూరు'పై మనసు పడిన మహేశ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.