ETV Bharat / entertainment

శింబు, గౌతమ్​ మేనన్​కు ఆ నిర్మాత సర్​ప్రైజ్​.. గిప్ట్​గా లగ్జరీ కారు, బైక్​

కోలీవుడ్ స్టార్ హీరో శింబు, డైరెక్టర్​ గౌతమ్​ మేనన్​కు​.. ఓ నిర్మాత ఖరీదైన కారు, బైక్​ను బహుమతిగా ఇచ్చాడు. ఎందుకంటే..

author img

By

Published : Sep 27, 2022, 7:40 PM IST

simbu
శింబు

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శింబు నటించిన తాజా చిత్రం వెందు తానిందథు కాడు. తెలుగలో ముత్తుగా విడుదలైంది. గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ దర్శకుడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూవీ టీమ్​ సంతోషంలో మునిగితేలుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత ఇశారీ గణేశ్‌ చిత్రబృందానికి గ్రాండ్‌ పార్టీ ఇచ్చాడు. అంతేకాదు హీరో శింబుకు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. డైరెక్టర్‌ గౌతమ్‌ మేనన్‌కు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను బహుమతిగా అందించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. శింబు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ఈ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.

Muttu movie success party
శింబు

కాగా ప‌ల్లెటూరు నుంచి బ‌తుకు తెరువు కోసం సిటీకి వ‌చ్చిన ఓ యువ‌కుడు పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడ‌నే క‌థాంశంతో ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు రూపొందించారు. ఈ సినిమాలో శింబు లుక్‌తో పాటు నటన చాలా బాగుందంటూ విమర్శకులు ప్రశంసలు అందాయి. ఇక ఈ చిత్రం కోసం శింబు 15 కేజీల వ‌ర‌కు బ‌రువు తగ్గాడు. అలాగే చాలా రోజుల తర్వాత గౌతమ్ మేనన్‌ డైరెక్షన్‌తో ఆకట్టుకున్నారని ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి రెహమాన్ స్వరాలు సమకూర్చారు. సిద్ధి ఇద్నాని, రాధికా శరత్ కుమార్, సిద్ధిక్, అప్పుకుట్టి తదితరులు కీలక పాత్రలో నటించారు.

Muttu movie success party
గౌతమ్​ మేనన్​

ఇదీ చూడండి: అలియాతో బెడ్​పై చాలా కష్టం.. ఆ సీక్రెట్​ షేర్​ చేసిన రణ్​బీర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.