ETV Bharat / entertainment

భారత్​​ - పాక్​ యుద్ధం నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ కొత్త సినిమా - మరో ఐదు రోజుల్లో డైరెక్ట్​గా ఓటీటీ రిలీజ్​ - పిప్పా అమెజాన్​ ప్రైమ్​ వీడియో నవంబర్ 10

'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించిన ఓ కొత్త సినిమా డైరెక్ట్​గా ఓటీటీ రిలీజ్​ కానుంది. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 1971 భారత్ - పాక్ యుద్ధం నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించారు. ఆ వివరాలు..

Mrunal Thakur Pippa Movie Release Date
భారత్​​ - పాక్​ యుద్ధం నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ కొత్త సినిమా - మరో ఐదు రోజుల్లో డైరెక్ట్​గా ఓటీటీలోకి
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 5:04 PM IST

Mrunal Thakur Pippa Movie Release Date : ఓటీటీ ప్లాట్​ఫామ్​లు తమ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్మెంట్​ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్​లను తీసుకువస్తుంటాయ్​. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు మాత్రమే కాకుండా.. డైరెక్ట్​గా ఓటీటీ రిలీజ్​ సినిమాలు, సీరిస్​లను కూడా తీసుకొస్తుంటాయ్​. అలా ఇప్పుడు సీతారామం ఫేమ్​ మృణాల్ ఠాకూర్ నటించిన ఓ లేటెస్ట్​ మూవీ డైరెక్ట్​గా ఓటీటీ రిలీజ్​కు రెడీ అయింది.

అదేంటంటే.. 'పిప్పా'. ఇందులో హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టార్ లీడ్​ రోల్​లో నటించారు. 1971 ఇండియా - పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిత్రంలో కెప్టెన్ బలరామ్ మెహతా పాత్రలో ఇషాన్ నటించారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించారు. రీసెంట్​గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఓటీటీలో డైరెక్ట్​ రిలీజ్ కానుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్​ను ఫిక్స్​ చేశారు మేకర్స్​. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నవంబర్ 10 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. యుద్ధంలో కెప్టెన్ బలరామ్ మెహతా చూపిన దేశభక్తి, పోరాటపటిమను ఈ సినిమాలో మేకర్స్ అద్భుతంగా చిత్రీకరించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఇంకా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్​తో పాటు ప్రియాన్షు పైన్యులీ, సోనీ రజ్దాన్ కూడా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆర్ఎస్‍వీపీ బ్యానర్‌పై రోనీ స్క్రీవాలా, రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సిద్ధార్థ రాయ్ కపూర్ చిత్రాన్ని నిర్మించారు.

ఇకపోతే ఇషాన్ కట్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన తొలి చిత్రం ధడక్​లో అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్​తో కలిసి నటించారు. ఈ సినిమా మంచి హిట్​ను అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలు చేశారు. ఇక సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. త్వరలోనే నానితో కలిసి హాయ్ నాన్న(Mrunal Thakur Hai Nanna Movie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాలోనూ నటిస్తోంది. అలా ఇటు తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mrunal Thakur Upcoming Movies : మృణాల్​​ ఠాకూర్ భవిష్యత్​​.. ఆ రెండిటిపైనే భారీ ఆశలు!

Nani Mrunal Liplock : మృణాల్​ ఠాకూర్​తో​ లిప్ ​లాక్​.. హీరో నాని ఇంట్లో గొడవలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.