Movies Releasing On Friday: వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచింది. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో బింబిసార, సీతారామం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
'శరణు కోరితే ప్రాణభిక్ష.. ఎదిరిస్తే మరణం'.. 'శరణు కోరితే ప్రాణ భిక్ష.. ఎదిరిస్తే మరణం' అంటున్నారు కల్యాణ్ రామ్. ఆయన కథానాయకుడిగా వశిష్ఠ్ తెరకెక్కించిన చిత్రం 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించారు. సంయుక్తా మేనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రేపే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. చరిత్రకు వర్తమానానికి ముడిపెడుతూ సాగే విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో కల్యాణ్ రామ్ బింబిసారుడిగానే కాక మరో స్టైలిష్ అవతారంలోనూ కనిపించనున్నారు. కల్యాణ్‌రామ్ తొలిసారి ఇలాంటి జోనర్‌లో నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
'యుద్ధం రాసిన ప్రేమ కథ'.. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన ప్రేమకథా చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రష్మిక కీలకపాత్రలో నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వనీదత్, ప్రియాంకదత్ నిర్మించారు. ఈ సినిమా కూడా రేపే (శుక్రవారం) ధియేటర్లలోకి రానుంది. 'చాలా గొప్ప కథ ఇది. ప్రేమకథతో పాటు యుద్ధం లాంటి సంఘర్షణ కనిపిస్తుంది' అని చిత్ర బృందం చెబుతోంది. ఈ మూవీలో సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంది. వెండి తెరపై సీతా-రామ్ ప్రేమకథ చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ శుక్రవారం(05-08-2022) ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- ఆహా- పక్కా కమర్షియల్
చిత్రం: పక్కా కమర్షియల్; నటీనటులు: గోపిచంద్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్ తదితరులు; సంగీతం: జేక్స్ బిజోయ్; దర్శకత్వం: మారుతి - ఆహా- మహా (తమిళ చిత్రం)
- నెట్‌ఫ్లిక్స్- డార్లింగ్స్
చిత్రం: డార్లింగ్స్; నటీనటులు: అలియా భట్, షెఫ్లీ షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ తదితరులు; సంగీతం: విశాల్ భరద్వాజ్; దర్శకత్వం: జస్మీత్ కె.రీన్ - నెట్‌ఫ్లిక్స్- కార్టర్ (కొరియన్ మూవీ)
- నెట్‌ఫ్లిక్స్- ద శాండ్ మాన్ (వెబ్ సిరీస్)
- అమెజాన్ ప్రైమ్- క్రాష్ కోర్స్ (హిందీ సిరీస్)
- అమెజాన్ ప్రైమ్- థర్టీన్ లైవ్స్ (హాలీవుడ్)
ఇవీ చదవండి: NBK 107: రాఖీ రోజు అదిరిపోయే సర్‌ఫ్రైజ్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే..