ETV Bharat / entertainment

NBK 108 టైటిల్​ లాంఛ్​ కోసం భారీ ప్లాన్​.. టాలీవుడ్​ చరిత్రలో తొలిసారిగా! - ఎన్​బీకే 108 టైటిల్​

NBK 108 Title : నందమూరి నటసింహం లేటెస్ట్ మూవీ ఎన్​బీకే 108 టైటిల్​ రివీల్​ కోసం భారీగానే ప్లాన్​ చేస్తోంది మూవీ టీమ్. ఇందులో భాగంగా టాలీవుడ్​లో మునుపెన్నడు లేని విధంగా ఓ ఈవెంట్​ను చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదేంటంటే ?

ఎన్​బీకే 108 టైటిల్​ కోసం భారీ ప్లాన్
ఎన్​బీకే 108 టైటిల్​ కోసం భారీ ప్లాన్
author img

By

Published : Jun 7, 2023, 12:51 PM IST

NBK 108 Title : టాలీవుడ్​ నటసింహం నందమూరి బాలకృష్ణ తన 108 సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. అయితే ఇప్పటికే విడుదలైన రెండు పోస్టర్లతో అభిమానులకు గూస్​బంప్స్​ తెప్పించిన మూవీ టీమ్​ ఈ సారి టైటిల్​ రివీల్​ కోసం గట్టిగానే ప్లాన్​ చేస్తోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్​బీకే 108కు 'భగవంత్ కేసరి' అనే టైటిల్​ను పరిశీలించారట. దాన్నే ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్​ను రివీల్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది​. జూన్​ 10న ఆయన బర్తడే సందర్భంగా.. రెండు రోజుల ముందే జూన్​ 8న టైటిల్ లాంఛ్​ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించనున్నారట.

NBK 108 Title Reveal : అయితే కాస్త డిఫరెంట్​గా ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని 108 లొకేషన్లలో భారీ హోర్డింగ్స్​ను ఏర్పాటు చేసి.. వాటిపై టైటిల్ అనౌన్స్ చేసేందుకు ప్లాన్​ చేసింది. 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది.

NBK 108 Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. అనిల్​ రావిపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ యాక్షన్​ మూవీలో బాలకృష్ణ డిఫరెంట్​ షేడ్స్​ ఉన్న రోల్​లో నటిస్తున్నారు. ఇక ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. యంగ్​ హీరోయిన్​ శ్రీలీలతో పాటు, తమిళ స్టార్​ హీరో శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారు. ''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.