ETV Bharat / entertainment

Mokshagna Latest Photos : ఒకే ఫ్రేమ్​లో ఎన్టీఆర్-మోక్షజ్ఞ.. రాయల్ లుక్​ అదిరింది బాసూ.. ఈ పిక్​ చూశారా? - నందమూరి సోదరులు ఒకే ఫ్రేమ్​లో

Mokshagna Latest Photos : దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహం గ్రాండ్​గా జరిగింది. ఈ పెళ్లికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్​.. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఒకే ఫ్రేమ్​లో కనపడి నందమూరి అభిమానుల్లో ఖుషీని నింపారు. ఆ పిక్స్​ చూశారా?

Mokshagna Latest Photos : ఒకే ఫ్రేమ్​లో ఎన్టీఆర్-మోక్షజ్ఞ.. రాయల్ లుక్​ అదిరింది బాసూ.. ఈ పిక్​ చూశారా?

author img

By

Published : Aug 21, 2023, 9:53 AM IST

Mokshagna Latest Photos : నందమూరి ఫ్యామిలీలో పెళ్లి సందడి జరిగింది. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహం గ్రాండ్​గా జరిగింది. ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ పెళ్లి వేడుకకు ఇంకా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తమ సోదరి కొడుకు(Nandamuri suhasini son marriage) పెళ్లి వేడుక కావడం వల్ల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా ఈ వేడుకలో కనిపించి సందడి చేశారు. ఎంతో హుందాగా కనిపించారు. అన్నీ తామై పెళ్లి వేడుకని ముందుండి చూసుకున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ ఫంక్షన్​లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. నందమూరి సోదరులు ఒకే ఫ్రేమ్​లో కనిపించడంతో అభిమానులు తెగ సంబరిపడిపోతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఒకే దగ్గర చేరి ఫోటోలకు పోజులిచ్చారు. అందరూ కలిసి సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు.

అసలే ఇప్పటికే మోక్షజ్ఞ(mokshagna movies) టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడిస్తాడో అని ఆశగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు.. ఈ పిక్స్​ చూసి తెగ పండగ చేసుకుంటున్నారు. తన సోదరులైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్​తో కలసి మోక్షజ్ఞ ఇలా కనిపించడం ఫ్యాన్స్​కు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సోదరులంతా స్టైలిష్ షేర్వాణీ కుర్తా ధరించి రాయల్​ లుక్​లో మెరిశారు. ఇకపోతే మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, శ్రీకాంత్​ ఓదేల దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరితో కలిసి మోక్షజ్ఞ అరంగేట్రం చేస్తాడో చూడాలి..

ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ఆర్​ఆర్​ఆర్​తో బిగ్గెస్ట్ హిట్​ అందుకున్న ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర(NTR Devara movie) సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అలాగే బింబిసారతో ఫామ్​లోకి వచ్చిన కల్యాణ్​ రామ్​.. రీసెంట్​గా అమిగోస్​తో ఆకట్టుకోలేకపోయారు. త్వరలోనే డెవిల్(Kalyan ram Devil movie)​ అనే భారీ చిత్రంతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇందులో సంయుక్త మేనన్ హీరోయిన్​గా నటించింది.

మోక్షజ్ఞ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ ప్లాన్ సూపర్​​.. ఆ మాస్​ దర్శకుడితోనే!

మోక్షజ్ఞ టాలీవుడ్​ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.