ETV Bharat / entertainment

Mokshagna Bhagavanth Kesari : 'భగవంత్​ కేసరి' సెట్స్​కు మోక్షజ్ఞ అందుకే వెళ్లేవారట.. వచ్చే ఏడాదే సినీ ఎంట్రీ!​ - భగవంత్​ కేసరి సెట్స్​లో మోక్షజ్ఞ

Mokshagna Bhagavanth Kesari : నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ప్రస్తుతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారు. అయితే ఇటీవలే 'భగవంత్​ కేసరి' టీమ్​తో తరచూ ఆయన కనిపిస్తున్నారు. ఈ విషయంపై నిర్మాత సాహు గారపాటి ఏమన్నారంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 4:08 PM IST

Updated : Oct 14, 2023, 8:22 PM IST

Mokshagna Bhagavanth Kesari : నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ సినీ తెరంగేట్రానికి సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ పర్​ఫెక్ట్ యాక్టర్​గా అవ్వడానికి కావాల్సిన అన్ని విషయాలను నేర్చుకుంటున్నారట. తన డెబ్యూ సమయానికి హీరో మెటీరియల్​గా మారాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు టాక్​ వినిపిస్తోంది.

అయితే ఈ మధ్యకాలంలో మోక్షజ్ఞ.. 'భగవంత్ కేసరి' సినిమా ఈవెంట్స్​లో బాగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు సినిమా వేడుకలు, షూటింగ్​లకు దూరంగా ఉండే ఆయన తరచూ మీడియాలో కంట్లో పడుతున్నారు. రీసెంట్​గా భగవంత్​ కేసరి సెట్స్​లోనూ కనిపించి సందడి చేశారు. షూటింగ్​ స్పాట్​లో సరదాగా గడుపుతూ.. దర్శకుడు అనిల్ ​రావిపూడి, నటి శ్రీలీల, కొరియోగ్రాఫర్​ శేఖర్​ మాస్టర్​తో కలిసి ముచ్చటించారు. ఇలా మోక్షజ్ఞ తరచూ సెట్స్​ను సందర్శించడంపై మూవీ నిర్మాత సాహూ గారపాటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. "వీలైనప్పుడల్లా లొకేషన్‌కు బాలకృష్ణతో పాటు మోక్షజ్ఞ వెళ్తున్నారు. వచ్చే ఏడాది ఆయన్ను సినిమాలకు పరిచయం చేయాలని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. సినిమా నిర్మాణం గురించి అర్థం చేసుకునేందుకు మోక్షూ ప్రతిదీ దగ్గరనుంచి గమనిస్తున్నారు" అని సాహు చెప్పారు.

కాగా, మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్​మెంట్​ వచ్చే అవకాశాలు ఉన్నాయని బాలయ్య బాబు అభిమానులు భావిస్తున్నారు. ఈ ప్రకటనకు సంబంధించి డేట్​, టైమ్​ కూడా ఫిక్స్ చేసినట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే భారీ బడ్జెట్​ చిత్రంతోనే మోక్షజ్ఞ గ్రాండ్​గా లాంఛింగ్​ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కమర్షియల్, యాక్షన్ ఎంటర్​టైనర్​ కథతో రావాలని.. దాని కోసం ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఅర్ స్థాయిలో స్టార్​ హీరోగా మోక్షజ్ఞ ఎదగాలని బాలయ్య బాబు అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికొస్తే.. మాస్​, యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా సినిమా రూపుదిద్దుకుంది. శ్రీలీల, కాజల్​ అగర్వాల్​ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 19న సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి సినిమాకు దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మోక్షజ్ఞ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ ప్లాన్ సూపర్​​.. ఆ మాస్​ దర్శకుడితోనే!

Mokshagna Latest Pics : సింహం యాటకొచ్చే సమయం వచ్చినట్టుంది.. 'భగవంత్ కేసరి' సెట్స్​లో మోక్షజ్ఞ

Last Updated : Oct 14, 2023, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.