ETV Bharat / entertainment

హాలీవుడ్​లో 'మోదీ' బయోపిక్..​ డైరెక్టర్​గా​ ప్రముఖ నటుడు జానీ డెప్​! - పెర్రీ నీనే మోదీ బయోపిక్

Modi Biopic By Johnny Depp : ప్రముఖ హాలీవుడ్​ నటుడు జానీ డెప్​ దర్శకత్వంలో 'మోదీ' బయోపిక్​ రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు రికార్డో స్కామార్సియోతో పాటు పెర్రీ నీనే, అల్​ పాసినో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆ వివరాలు..

modi biopic by johnny depp
modi biopic by johnny depp
author img

By

Published : May 12, 2023, 4:25 PM IST

Updated : May 12, 2023, 5:10 PM IST

Modi Biopic By Johnny Depp : 'పైరేట్స్​ ఆఫ్​ ది కరేబియన్'​ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు హాలీవుడ్​ నటుడు జానీ డెప్​. దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత ఈ యాక్టర్​ మొదటి సారి మెగా ఫోన్​ పట్టుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నట్లు సమాచారం. 'మోదీ' జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రముఖ ఇటాలియన్ నటుడు రికార్డో స్కామార్సియోతో పాటు పెర్రీ నీనే, అల్​ పాసినో లాంటి ప్రముఖ నటులను ఎంపిక చేశారు. దీంతో ఈ 'మోదీ' బయోపిక్​ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదే అని సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.

అయితే, జానీ డెప్​ 'మోదీ' పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. కానీ అది నరేంద్ర మోదీ బయోపిక్​ కాదు. పెయింటర్​, శిల్పి అయిన అమెడియో మోదీగ్లియాని అనే ఇటాలియన్​ కళారుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1916లో మోదీ గ్లియాని పారిస్​లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా, విషయంపై జానీ డెప్ ఇంతవరకు స్పందించలేదు. ఈ సినిమా నిర్మాత బారీ నావి స్పందిస్తూ.. కళాకారుడిగా మోదీ గ్లియాని ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు.. తన గుర్తింపు కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు అనే విషయాల ఆధారంగా సినిమా ఉంటుందని హింట్​ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్​ త్వరలో బుడాపెస్ట్​లో జరగనుంది. 'మోదీ' బయోపిక్​కు సంబంధించి ఇతర తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్.

జానీ డెప్​.. రచయిత, నటుడు, సింగర్, నిర్మాతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. 9 జూన్​ 1963న జన్మించిన జానీ డెప్.. 1984లో వచ్చిన 'ఎ నైట్​మేర్​ ఆన్​ ఎల్మ్​ స్ట్రీట్​' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరుస సినిమాలతో అగ్రనటుడిగా ఎదిగారు. 1997లో 'ది బ్రేవ్'​ చిత్రం ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు డెప్​. ​

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ఒకటి వచ్చింది. బాలీవుడ్​ నటుడు వివేక్ ఒబెరాయ్ మోదీ పాత్రలో 'పీఎమ్​ నరేంద్ర మోదీ' అనే పేరుతో ఓ సినిమా విడుదలైంది. ఇదే కాకుండ దిగ్గజ బాలీవుడ్​ డైరక్టర్​ సంజయ్​ లీలా బన్సాలీ దర్శకత్వంలో మన్​ 'బైరాగి' అనే మరో చిత్రం కూడా తెరకెక్కింది. ఈ సినిమాలో మోదీ గురించి ప్రజలకు తెలియని కథను చూపించారు. యువకుడిగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టిన మోదీని ఈ చిత్రంలో చూపించారు.

Last Updated : May 12, 2023, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.