Miss Shetty Mr Polishetty Dinesh Karthik : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి - స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం.. సెప్టెంబర్ 7 న థియేటర్లలో రిలీజై.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే గతనెల( అక్టోబర్) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన టీమ్ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్.. తన అభిప్రాయాన్ని చెప్పాడు.
"చాలా రోజుల నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. అయితే నా వెయింటిగ్కు మంచి ఫలితమే దక్కింది. ఈ సినిమా కోసం వెయిట్ చెయ్యెచ్చు. ఇలాంటి రొమాన్స్ + కామెడీ సినిమాలంటే నాకెంతో ఇష్టం. సినిమా ఫన్నీగా ఉంది" అని దినేశ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్‌కు హీరో నవీన్ స్పందించాడు. "థాంక్యూ సో మచ్ దినేశ్ కార్తిక్. ఈ వరల్డ్‌కప్‌లో మీ కామెంటరీ బాగుంది" అని రిప్లై ఇచ్చారు.
సినిమా విషయానికొస్తే.. కామెడీ ఎంటర్టైనర్, సరోగసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నవీన్ - అనుష్క మధ్య సన్నివేశాలను డైరెక్టర్ పచ్చిగొళ్ల మహేశ్ బాబు.. నేచురల్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో యసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని.. యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు.
Miss Shetty MR Polishetty Boxoffice Collection : ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ టీవీ సొంతం చేసుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఓటమి నుంచి కోలుకోకుండానే ఆర్సీబీకి మరో షాక్..దినేశ్ కార్తీక్‌కు అనారోగ్యం!
Miss Shetty MR Polishetty Box Office Collection : ఓవర్సీస్లో కాసుల వర్షం.. ఆ మార్క్‌కు చేరువలో!