ETV Bharat / entertainment

Marudhanayagam Movie Budget : కమల్ భారీ బడ్జెట్ సినిమాకు బ్రిటిషర్ల బ్రేక్.. కారణం అదే! - Marudhanayagam Story

Marudhanayagam Movie Budget : తమిళ స్టార్ హీరో కమల్​ హాసన్ 1997లో భారీ బడ్జెట్​తో.. తన డ్రీమ్ ప్రాజెక్ట్​ను తెరకెక్కించాలని అనుకున్నారు. స్ర్కిప్ట్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. మరి అందుకు గల కారణం, అప్పట్లో ఈ సినిమాకు అనుకున్న బడ్డెట్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Marudhanayagam Movie Budget
Marudhanayagam Movie Budget
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 9:54 PM IST

Marudhanayagam Movie Budget : 'ఆదిపురుష్​' సినిమా విడుదలైనప్పుడు చాలా మంది ఆ సినిమా గురించి కంటే దానికి పెట్టిన పెట్టుబడి గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. సుమారు రూ. 700 కోట్లతో రూపొందిన ఈ సినిమా భారత్​లో ఇప్పటి వరకు భారీ బడ్జెట్​తో రూపొందిన సినిమాగా చరిత్రకెక్కింది. అయితే ఈ సినిమాకంటే ముందు ఓ సినిమా ఇంతకంటే భారీ వ్యయంతో రూపొందింది. అయితే ఆ సినిమా తెరపైకి రాకుండానే ఆగిపోయింది. 1997లో మొదలైన ఆ చిత్రం ఇప్పటి వరకు రిలీజ్​కు నోచుకోలేదు. దీని వెనక పెద్ద కారణం ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే..

లోకనాయకుడు కమల్​ హాసన్​ ఓ నటుడిగానే కాకుండా ఓ దర్శకుడిగా, ఓ నిర్మాతగా పేరొందారు. 'హే రామ్'​, 'విశ్వరూపం', 'చాచీ 420' లాంటి సినిమాలను రూపొందిచిన ఆయన.. రాజ్​ కమల్​ ఫిల్మ్స్​ ఇంటర్నేషనల్ బ్యానర్​పై ఎన్నో సూపర్​ హిట్​ సినిమాలను తెరకెక్కించారు. ఈ క్రమంలో 1997లో తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ 'మరుదనాయగం' నిర్మించాలనుకున్నారు.

Marudhanayagam Story : 18వ శతాబ్దంలోని స్వాతంత్ర్య సమరయోధుడు 'మరుదనాయగం పిళ్లై' జీవితం ఆధారంగా శామ్యూల్ చార్లెస్ హిల్ అనే రైటర్​ రాసిన కథను ఈ సినిమాకు ఆధారంగా తీసుకున్నారు. దాన్ని సినిమా కథగా రూపొందించేందుకు కమల్​ ఆరేళ్లు కష్టపడ్డారు. ఇక ఆయనతో పాటు ఈ సినిమాలో నాజర్, విష్ణువర్ధన్, సత్యరాజ్ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషించేందుకు రెడీగా ఉన్నారు.

ఇక స్క్రిప్ట్ వర్క్ మొదలయ్యాక మూవీ టీమ్ మొత్తం కాస్ట్యూమ్స్​ కోసం యూరప్‌లోని వివిధ ప్రాంతాలను కూడా సందర్శించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.85 కోట్ల బడ్జెట్​తో రూపొందేందుకు ప్లాన్స్​ కూడా జరిగాయి. ఇప్పటి లెక్కల్లో అయితే ఆ సొమ్ము కచ్చితంగా రూ. 600 కోట్లకు పైగా దాటుంటుంది. ఇక ఈ సినిమాకు ఫండ్స్​ ఇచ్చేందుకు భారత్​, ఫ్రెంచ్​, ఇంగ్లీష్​ ప్రొడక్షన్ హౌస్‌లు ముందుకొచ్చాయి. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా ఈ సినిమా.. షూటింగ్ దశలోనే ఆగిపోయింది. 1998లో భారత్​ పోఖ్రాన్ శ్రేణిలో అణుబాంబులను పరీక్షించింది. ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ మాత్రం నచ్చలేదు. దీంతో బ్రిటీష్ ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

దీంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలన్న కమల్ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అయితే ఈ మూవీ రిలీజ్ కాకపోయినా.. క్వీన్ ఎలిజబెత్-2 చీఫ్ గెస్ట్‌గా ఈ సెట్స్​కు రావడం అనేది ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 1997లో జరిగిన పూజా కార్యక్రమానికి బ్రిటన్ రాణి క్వీన్​ ఎలిజబెత్​ హాజరయ్యారు. అంతే కాకుండా ఆమె సుమారు 20 నిమిషాల పాటు సెట్స్​లోనే గడిపారు. ఇక ఆమె తర్వాత ఆ సెట్స్​కు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిథి కూడా వచ్చారు.

  • (1997) Kamal Haasan, Sarika, Nassar and Om Puri with Queen Elizabeth II during the launch of unfinished film ‘Marudhanayagam’ pic.twitter.com/FmFC1Teo7I

    — Film History Pics (@FilmHistoryPic) September 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • எழுபதாண்டுகளாக இங்கிலாந்தின் மகாராணியாக திகழ்ந்த இரண்டாம் எலிசபெத் இயற்கை எய்திய செய்தியைக் கேட்டு துயருற்றேன். ஆங்கிலேயர்கள் மட்டுமல்லாது, அகில உலகத்தவரின் நேசத்தையும் பெற்றவராக அவர் விளங்கினார். (1/3) pic.twitter.com/EFmKfqls7U

    — Kamal Haasan (@ikamalhaasan) September 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కడప గండికోటలో భారతీయుడు-2..​ పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ

కమల్ హాసన్​తో మణిరత్నం భారీ ప్రాజెక్ట్​.. 35 ఏళ్ల తరువాత క్రేజీ కాంబో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.