ETV Bharat / entertainment

బాలీవుడ్​ నటుడు మనోజ్​ ట్విట్టర్​ అకౌంట్​ హ్యాక్​.. సస్పెన్షన్​పై క్లారిటీ ఇచ్చిన 'కాంతార' కిశోర్​! - కాంతార ఫేమ్​ కిశోర్​​ కుమార్ ట్విట్టర్​ అకౌంట్​

బాలీవుడ్​ నటుడు మనోజ్​ బాజ్​పాయ్ ట్విట్టర్​ అకౌంట్​ హ్యాక్​ అయింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతుండగా ఆయన ఇన్​స్టాలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, కాంతార ఫేమ్​ నటుడు కిశోర్​ కుమార్​ అకౌంట్​ సైతం ఇదే సమస్యను ఎదుర్కొన్నట్లు ఆయన స్పష్టత ఇచ్చారు.

kishore kumar
manoj bajpayee
author img

By

Published : Jan 6, 2023, 2:22 PM IST

ప్రముఖ బాలీవుడ్​ నటుడు మనోజ్​ బాజ్​పాయ్​ ట్విట్టర్​ అకౌంట్​ హ్యాక్​ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఇన్​స్టాలో తెలిపారు. అకౌంట్​ తిరిగి సరిచేసేంత వరకు అభిమానులు దాని జోలికి వెళ్లొద్దని కోరారు. "నా ట్విట్టర్ అకౌంట్​ హ్యాక్​ అయ్యింది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దయచేసి అభిమానులు ఎవరూ నా అకౌంట్​ జోలికి వెళ్లదు. దాని నుంచి వచ్చిన ఎటువంటి పోస్టులను గమనించొద్దు" అని ఇన్​స్టాలో పేర్కొన్నారు.

బాలీవుడ్​లో ఇలా ఉండగా సాండల్​వుడ్​లోనూ ఇటీవలే ఓ స్టార్​ అకౌంట్​ హ్యాక్​ అయ్యింది. కాంతార ఫేమ్​ కన్నడ స్టార్ కిశోర్​​ కుమార్​కు ట్విట్టర్​లో ఓ సమస్య ఎదురయ్యింది. ట్విట్టర్​ నిబంధనలను ఉల్లంఘించిన వారి ఖాతాలను సంస్థ నిలిపివేస్తుంది అని ఆయన పేజ్‌లోకి వెళ్లినవారికి ఈ సందేశం కనిపిస్తోంది. దీంతో ఆయన ట్విట్టర్​ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని అందుకే తన ఖాతాను నిలిపివేశారని కొందరు అంటుంటే.. తన పోస్ట్‌ల కారణంగానే ఇలా జరిగిందని మరికొందరు చెబుతున్నారు. అయితే తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేయడం వల్లే ఇలా జరిగిందని కిశోర్​ ఇన్​స్టాలో తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.