ETV Bharat / entertainment

'ఆ స్టార్ హీరోలు ఛాన్స్​లు ఇవ్వట్లేదు'- మణిశర్మ షాకింగ్ కామెంట్స్! - మణిశర్మ మహేశ్

Mani Sharma Interview : మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫుల్ వైరల్​గా మారాయి. అసలు ఆయన ఏమన్నారు?

Mani Sharma Interview
Mani Sharma Interview
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 2:15 PM IST

Mani Sharma Interview : మణిశర్మ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మహేశ్ దగ్గర నుంచి పవన్, చిరంజీవి ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలకు వాళ్ల కెరీర్‌లో గుర్తుండిపోయే సాంగ్స్ ఇచ్చారు. అలాంటి ఈయన ఇప్పుడు చోటామోటా హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిశర్మ తనకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మణిశర్మ ఏమన్నారు?
'ఇప్పుడు ఏ విషయంలోనైనా హర్ట్ అవుతున్నారా?' అని యాంకర్ అడిగాడు. దీనికి బదులిచ్చిన మణిశర్మ 'హర్ట్ అయ్యేందుకు కారణం ఉందంటే మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి హీరోలు అందరికీ ఒక్కో ఛాన్స్ ఇవ్వొచ్చు. అలా అన్ని నాకే ఇచ్చేయాలని అనట్లేదు. ఒక్కొక్కరికి తలో ఛాన్స్ ఇస్తే జనాలకు కూడా వెరైటీగా ఉంటుంది. దేవీకి ఓ సినిమా నాకో సినిమా తమన్‌కు ఓ సినిమా పోనీ వాళ్లకు రెండు ఇచ్చి నాకు ఒకటే ఇవ్వండి. అలా పంచితే అందరికీ వెరైటీగా ఉంటుంది. ఇది నా వరకు నేను అనుకునేది. నేను వెళ్లి వాళ్లతో చెప్పలేదు. ఎవరితో చెప్పలేను' అని మణిశర్మ తన మనసులోని బాధను బయటపెట్టారు.

ఇప్పటికీ చాలా మంది మణిశర్మ బాణీలు కట్టిన పాటలను వింటూ ఉంటారు. చెప్పాలంటే 1998 నుంచి 2011 వరకు టాలీవుడ్ లో మెలోడీ బ్రహ్మ యుగం నడిచిందనే చెప్పొచ్చు. ఆ సమయంలో ఎన్నో వందల అద్భుతమైన పాటలతోపాటు మర్చిపోలేని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను మణిశర్మ ప్రేక్షకులకు అందించారు. గత కొన్నేళ్లుగా మణిశర్మ అడపాదడపా సినిమాలను మాత్రమే చేస్తున్నారు. ఇండస్ట్రీలోని కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు పెరగడం, వేరే ఇండస్ట్రీ నుంచి సంగీత దర్శకులను తెచ్చుకోవడం వల్ల ఆయనకు అవకాశాలు బాగా తగ్గాయి. 2023లో మణిశర్మ నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది. 2022లో అది కూడా లేదు. ఇప్పుడు మణిశర్మ చేతిలో కేవలం రెండు సినిమాలే ఉన్నాయి. కానీ అలాంటి మణిశర్మ ఇప్పుడు ఛాన్సులు కోసం బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

  • Evaru Chance ichina ivvakapoyina Manisharma is god of Telugu melody ❤️

    I owe you Mani garu for giving us 100’s of wonderful songs, I rarely listen to music but when I start listening it would be from your album 🤗

    Love u Melody bramhi #Manisharma 🐐

    pic.twitter.com/DJ5uYXkjpZ

    — 𝓖𝓮𝓻𝓶𝓪𝓷 𝓓𝓮𝓿𝓪𝓻𝓪 ⚒️ (@HemanthTweets39) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.