ETV Bharat / entertainment

జక్కన్నతో సినిమా చేయాలని ఉంది.. అతడే ట్రోలింగ్​ చేయిస్తున్నాడట!: మంచు విష్ణు - మంచు విష్ణు రాజమౌళి సినిమా

నటుడిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేందుకు శ్రమిస్తానని, ఇకపై 'మా' సహా ఎలాంటి ఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని మంచు విష్ణు తెలిపారు. 'జిన్నా' సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహించిన మీమర్స్‌/యూట్యూబర్స్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. విష్ణు హీరోగా ఇషాన్‌ సూర్య తెరకెక్కించిన చిత్రమిది. సన్నీ లియోనీ, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. త్వరలోనే విడుదలకాబోతున్న 'జిన్నా' సినిమా విశేషాలతో పాటు విష్ణు పంచుకున్న మరికొన్ని ఆసక్తికర సంగతులివీ..

rajamouli manchu vishnu
రాజమౌళి మంచు విష్ణు
author img

By

Published : Sep 27, 2022, 9:50 PM IST

ఇకపై 'మా' సహా ఎలాంటి ఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని మంచు విష్ణు పేర్కొన్నారు. తనను టార్గెట్​ చేసి ట్రోలింగ్​ చేస్తుంది ఎవరో తెలుసుకున్నట్లు చెప్పారు. 'జిన్నా' సినిమా ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారంటే..

అక్టోబరు 5న మరో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. 'జిన్నా' ప్రత్యేకత ఏంటి?
విష్ణు: 'జిన్నా' కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించాలనుకున్నా. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడే చెబుతున్నా. ముందుగా అనుకున్నట్టు మన సినిమా 'జిన్నా' అక్టోబరు 5న విడుదల కావట్లేదు. అక్టోబరు 21న రానుంది. అక్టోబరు 5న ట్రైలర్‌ విడుదల చేస్తాం.
ఇది ఏ జానర్‌ సినిమా? ఎంత వసూళ్లు చేస్తుందనుకుంటున్నారు?
విష్ణు: 'చంద్రముఖి' ఏ జానర్‌ సినిమానో ఇదీ అలాంటిదే (హారర్‌ కామెడీ). ఏ నిర్మాత అయినా తన చిత్రం విడుదలై, మంచి విజయం అందుకోవాలనుకుంటాడు. ఈ సినిమా విషయంలో నేను నటుడిని. నాన్న నిర్మాత. నిజం మాట్లాడుకుందాం.. టాప్‌ 5 నటుల జాబితాలో నేను లేను. ఇది అందరికీ తెలిసిందే. టాప్‌ 5, టాప్‌ 3, టాప్‌ 1లో నిలవాలనుంది. దానికి తగ్గ కృషి చేస్తా. ఒక్క అపజయం ఎదురైనప్పుడు దిగులుపడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. నటుల జీవితం ప్రతి శుక్రవారం మారిపోతుంటుంది. ఇక్కడ 50 శాతం హార్డ్‌ వర్క్‌, 50 శాతం లక్‌ ఉండాలి. నేను కష్టపడుతున్నా.. అదృష్టం కలిసొస్తుందనుకుంటున్నా. ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వస్తాయనే నమ్మకం ఉంది. ఈ చిత్రం నటుడిగా నాకు మంచి పేరు తీసుకొస్తుందనుకుంటున్నా.
ఏ అగ్ర దర్శకులతో పనిచేయాలనుకుంటున్నారు?

విష్ణు: ఈ జాబితాలో రాజమౌళి ముందుంటారు. గతంలో బాపుగారి దర్శకత్వం వహించిన ఓ సినిమాలో ఓ పాత్ర చేస్తానని ఆయన్ను అడిగా . 'మీరు అలాంటి చిన్న పాత్రలు చేయకూడదు. మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు' అని బాపు అన్నారు. మరికొందరు దర్శకులనీ అలాంటి (కథలో కీలకమైన పాత్ర) అవకాశం ఇవ్వమని అడిగా. కొత్తవారితో కలిసి పనిచేసేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు. ఓకే అని చెప్పిన వారు హ్యాండ్‌ ఇచ్చారు. ఇండస్ట్రీలో స్నేహితులు, శత్రువులు శాశ్వతం కాదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఢీ' సీక్వెల్‌ అప్‌డేట్‌ ఇస్తారా?
విష్ణు: దాని గురించి దర్శకుడు శ్రీను వైట్ల చెబుతారు. 'ఢీ' పెద్ద హిట్‌ అవుతుందని అప్పుడు మేం ఊహించలేదు. అన్ని సినిమాల్లానే దానికీ శ్రమించాం. కొన్ని కొన్ని క్లిక్‌ అవుతుంటాయి (నవ్వుతూ..)
సన్నీ లియోనీ గురించి చెబుతారా?
విష్ణు: తను నాకు మంచి స్నేహితురాలు. ఎంపిక చేసుకున్న పాత్రకు న్యాయం చేస్తుంది. ముందుగా ఈ సినిమాలో ఆమె ఫిక్స్‌ అయ్యాకే దర్శక-రచయితలు నన్ను సంప్రదించారు.
మోహన్‌బాబు సినిమాలు రీమేక్‌ చేయాల్సి వస్తే దేన్ని ఎంపిక చేసుకుంటారు?
విష్ణు: అల్లుడు గారు. నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు విడుదలైందా సినిమా. నాకు మనసుకు బాగా దగ్గరైంది. అందులో చంద్రమోహన్‌ గారు చెప్పిన 'బాధ పెట్టే నిజానికన్నా సంతోషపెట్టే అబద్ధం మంచిది' అనే డైలాగ్‌ నాకు ఇష్టం. ఈ సంభాషణ నుంచి నేను పాఠం నేర్చుకున్నా.

కామెడీ విషయంలో ఈ సినిమా 'ఢీ' రేంజ్‌లో ఉంటుందా?
విష్ణు: తప్పకుండా ఉంటుంది. కానీ, హిట్‌ అనేది మాత్రం ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ప్రతి సినిమానీ ఇష్టం పడతాం.. ఒకేలా కష్టపడతాం.. ఫలితం ఎందుకు విభిన్నంగా వస్తుందో ఎవరూ చెప్పలేరు.
ఫన్‌ కోసం మేం మీ సినిమాలు చూస్తాం. మరి మీరు?
విష్ణు: విడుదల సమయంలో తొలి కాపీ చూసిన తర్వాత మరోసారి నా చిత్రాలను నేను చూడను. తెరపై నన్ను నేను చూసుకోవటానికి నాకు సిగ్గు. కార్టూన్‌లను ఎక్కువగా చూస్తుంటా.
మీరు 'మా' ప్రెసిడెంట్‌గా మళ్లీ పోటీ చేస్తారని తెలిసింది?
విష్ణు: లేదు. నేను మళ్లీ పోటీ చేయను. రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నానన్నారు. అదీ నిజం కాదు. నటుడిగా నా జీవితం చాలా బాగుంది. నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా నాకు గుర్తింపు వచ్చేలా కష్టపడతా.

''నాపై నెగెటివ్‌ మీమ్స్‌ వేసిన వారినీ, యూట్యూబ్‌లో నెగెటివ్‌ కంటెంట్‌ పెట్టిన వారినీ పిలిచా. కానీ, టార్గెట్‌ చేసి రాసేవారిని వదిలిపెట్టను. మీపై ట్రోల్స్‌ వస్తుంటే పట్టించుకోరేంటి అని 'మా' ఎన్నికల సమయంలో చాలామంది నన్ను అడిగారు. అప్పుడు ఎలక్షన్‌పైనే దృష్టి పెట్టా. ఇప్పుడు ట్రోల్స్‌ చేసిన వారిపై పెట్టా. నా కుటుంబాన్ని టార్గెట్‌ చేసుకుని కొందరు విమర్శించారు. సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. జూబ్లీహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీతోపాటు ఓ ప్రముఖ నటుడి ఆఫీసుకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లు బయటపడ్డాయి. ఆడవారిని విమర్శిస్తే 'మా' చాలా సీరియస్‌గా తీసుకుంటుంది'' అని మంచు విష్ణు వివరించారు.

ఇదీ చూడండి: నటి రెజీనాతో యాంకర్స్​ సుమ, ఉదయభాను డ్యాన్స్​.. వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.