ETV Bharat / entertainment

ఆ ముగ్గురు స్టార్​ హీరోల వల్లే ఈరోజు నేనిలా..: అడివి శేష్

author img

By

Published : May 1, 2022, 10:18 AM IST

Updated : May 1, 2022, 10:43 AM IST

Major movie adivi sesh: విభిన్నమైన కథలతో... అటు కథా రచయితగా, ఇటు నటుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ... ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్‌. త్వరలో 'మేజర్‌'తో మళ్లీ తెరమీద సందడి చేయనున్న ఈ యువ నటుడు తన ఇష్టాయిష్టాలను చెబుతున్నారిలా...

Major movie Adavi Sesh
మేజర్​ అడివి శేష్​

major movie adivi sesh: హీరో అడివి శేష్‌ నటించిన తాజా చిత్రం 'మేజర్‌'. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన ఇష్టాయిష్టాలను తెలిపారు. అవేంటో తెలుసుకుందాం..

అమ్మానాన్నలే అంతా... నేను పుట్టింది హైదరాబాద్‌లో అయినా పెరిగింది మాత్రం అమెరికాలో. నాన్న డాక్టర్‌ చంద్ర, అమ్మ భవాని, చెల్లి... వీళ్లే నా బలం, బలహీనత. నేను సినిమా రంగంలోకి వెళ్తానని చెప్పినప్పుడు వాళ్లు ప్రయత్నించమని ఇక్కడకు పంపించారే తప్ప నిరుత్సాహ పరచలేదు. నిజంగా వాళ్ల సహకారం లేకపోతే ఈ రోజున నేనిక్కడ ఉండేవాడిని కాదు.

ఆ ముగ్గురినీ మర్చిపోను.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కొందరు స్టార్‌హీరోలు నన్నెంతో ప్రోత్సహించారు. ఉదాహరణకు అల్లు అర్జున్‌ నా 'క్షణం' సినిమా పోస్టర్‌ను ట్వీట్‌ చేస్తే, మహేష్‌బాబు ఆ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 'మేజర్‌'కు తనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. నాని నా 'హిట్‌2'కి నిర్మాత. నా విజయం వెనుక వాళ్ల సహకారం ఎంతో ఉంది.

మేజర్‌ ఎందుకంటే... అది 2008. అప్పుడు నేను అమెరికాలో ఉన్నా. ముంబయి దాడుల్లో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ చనిపోయినట్లుగా టీవీలో చూపిస్తున్నారు. ఆయన ఫొటో చూశాక కొన్నేళ్లకు నేనూ ఆయనలానే ఉంటానేమోననిపించింది. అప్పటినుంచీ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. క్రమంగా ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యా. తన కథను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆయన జీవిత చరిత్రలో నటిస్తున్నా.

Major movie Adavi Sesh
మేజర్​ అడివి శేష్​

చాలా నేర్చుకున్నా... నేను శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్‌ యూనివర్సిటీలో సినిమా రంగానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నా కానీ మధ్యలోనే వచ్చేశా. 'బాహుబలి' సెట్‌లో యాభైరోజులు చేశాక నేను తీసుకున్న ఆ శిక్షణతో పోలిస్తే రాజమౌళిగారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాననిపించింది.

పేరు వెనుక... కొందరు 'మీ పేరు శేష్‌ ఏంటీ.. కాస్త వెరైటీగా ఉంది' అని అడుగుతారు. నిజానికి నా అసలు పేరు సన్నీ. మా బామ్మ పేరు శేషగిరీశ్వరి. నేను పుట్టినప్పుడు శేష్‌ సన్నీ చంద్ర అని పెట్టారు. ఆ మొదటి రెండు అక్షరాలనే తీసుకుని స్క్రీన్‌ నేమ్‌గా మార్చుకున్నా. ఒకవేళ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే... రచయిత అయ్యేవాడిని.

బాగా నష్టపోయా... నేను కాలిఫోర్నియాలో పెరిగినా... హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌ కష్టాలనూ అనుభవించా. 'పంజా'లో విలన్‌గా చేసిన కొన్నాళ్లకు రెండుమూడు కోట్ల రూపాయలు అప్పు చేసి మరీ 'కిస్‌' అనే సినిమా తీశా. దానికి కథా, దర్శకత్వం అన్నీ నేనే. సినిమా పోయింది. దాంతో అప్పిచ్చినవాళ్లలో కొందరు డబ్బులు ఇవ్వమంటూ ఒత్తిడి చేశారు. ఆ తరువాత ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. అప్పటి నుంచీ నా మనసుకు నచ్చిందే చేస్తున్నా.

మారిపోయా... సందీప్‌ ఉన్నికృష్ణన్‌ గురించి తెలిసేకొద్దీ నేను చాలా మారిపోయా. లెదర్‌ వస్తువుల్ని వాడటం మానేశా. ఒకప్పుడు జంతువుల్ని పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడు కుక్కపిల్లలూ, ఇతర జంతువులూ ప్రమాదానికి గురైనట్లు తెలిస్తే వెంటనే వాటిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నా.

Major movie Adavi Sesh
మేజర్​ అడివి శేష్​

మాట్లాడాలంటే భయం.. 'పంజా'లో చేస్తున్నప్పుడు..పవన్‌కల్యాణ్‌గారితో మాట్లాడాలంటే భయపడేవాడిని. ఓ రోజు ఆయనే నా దగ్గరకు వచ్చి 'అడివి బాపిరాజు గారు మీ బంధువు అవుతారా' అన్నారు. అవుననడంతో ఆయన రచనల గురించి చెప్పడం మొదలుపెట్టారు. నాకేమో వాటిల్లో చాలా వరకూ తెలియవు. దాంతో కేవలం తలాడిస్తూ ఉండిపోయా. అంత చనువుగా మాట్లాడుతున్నారు కదాని ధైర్యం చేసి 'ఏమీ అనుకోకపోతే మీ నంబరు ఇస్తారా' అని అడిగా.

ఇక నాకు ఇష్టమైన ప్రదేశం 'శాన్‌ఫ్రాన్సిస్కో'. నచ్చే ఆహారం.. బంగాళాదుంపల వేపుడు. ఇష్టమైన సినిమా క్రిస్టఫర్‌ నోలన్‌ తీసిన ద ప్రెస్టీజ్‌... వసంత కోకిల, పాత మిస్సమ్మ, గుండమ్మకథ. అభిమాన నటుడు.. ఆమిర్‌ఖాన్‌. మొదటి క్రష్‌.. మా ఇంగ్లిష్‌ టీచర్‌ మినీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: కొత్త రిలీజ్​ డేట్​తో 'మేజర్​'​.. పునీత్​ ఫ్యామిలీ నుంచి మరో హీరో!

Last Updated : May 1, 2022, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.