Sarkaru vaaripata chitchat with youtubers: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, మహానటి కీర్తిసురేశ్ నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. పరశురామ్ దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీటీమ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహేశ్, కీర్తి, పరశురామ్ కలిసి పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆ సంగతులివీ..
ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో మీరు సోఫాలో ఎగిరి కూర్చున్నట్లు చూపించారు. ఆ ఆలోచన ఎలా వచ్చింది?
మహేశ్: కీర్తి నాకు మెస్సేజ్ పెట్టినప్పుడు దాన్ని చూసి సంతోషించి.. వెన్నెల కిషోర్‌తో అదే విషయాన్ని చెప్పి.. అనంతరం ఒక రియాక్షన్ ఇవ్వాలని దర్శకుడు నాతో చెప్పారు. కానీ నాకు అది మరీ సాగదీసినట్లు అనిపించి.. కీర్తి పంపిన మెస్సేజ్ చూసిన వెంటనే సోఫాలో ఎగిరి కూర్చున్నట్లు రియాక్షన్ ఇస్తే బాగుంటుందనిపించింది. అదే కెమెరా ముందు చేశాను. నేను ఆ సీన్ చేసినప్పుడు సెట్‌లో ఉన్నవాళ్లందరూ గట్టిగా అరిచారు. ఆ రియాక్షన్ బాగా వర్కౌట్ అయ్యిందని హాలులో ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాక అర్థమైంది.
కర్నూలులో మీరు స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేశారు కదా. అస్సలు మీరు అలా ఎందుకు చేశారు?
మహేశ్: "అది ఎందుకు అలా జరిగిందో నాక్కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలియక మా టీమ్ మొత్తం షాక్, సర్‌ప్రైజ్‌లో ఉండిపోయింది. రెండేళ్లు కష్టపడి సినిమా చేశాం. దానికి అభిమానుల నుంచి వస్తోన్న ఆదరణ చూశాక.. స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేయాలనిపించింది. అలా, చేసేశా"
ఎవరైనా దర్శకుడు కథ చెప్పినప్పుడు.. మీరు ఎలా దాన్ని ఓకే చేస్తారు?
మహేశ్: పరశురామ్ కథ చెప్పినప్పుడు హీరోహీరోయిన్ ట్రాక్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకూ నా సినిమాల్లో ఇలాంటి ట్రాక్ చేయలేదు. అందుకే ఈసారి ఇలాంటిది చేయాలనే ఆసక్తి పెరిగింది. లుక్ గురించి కూడా ఆయన నాకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కేవలం నా లుక్ డిజైన్ చేసి పిక్ పంపారు. ఇక, ‘మహానటి’ లాంటి సినిమాతో అందరికీ చేరువైన కీర్తి ఇలాంటి డిఫరెంట్ రోల్‌లో నటించడం.. ఇలా ఎన్నో అంశాలు నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేలా చేశాయి. ఇక, కీర్తికి తన రోల్ గురించి జూమ్ కాల్‌లో చెప్పాం. ఆమె పడిపడి నవ్వింది.
"షూటింగ్ సమయంలో కీర్తితో జరిగిన ఓ సంఘటన మీతో పంచుకోవాలి. ఈ సినిమాలోని ఓ సీన్‌లో కీర్తి నన్ను తిట్టాలి. మూడు టేకులు తీసుకున్నప్పటికీ కీర్తి చేయలేకపోయింది. దాంతో డైరెక్టర్ ఆమె వద్దకు వెళ్లి.. ‘మేడమ్.. మీరు సార్‌ని తిట్టాలి. గుర్తుపెట్టుకోండి ఆయన్ని మీరు తిట్టాలి’ అని చాలాసార్లు చెప్పారు. కీర్తి ఇబ్బందిపడుతోందని నాకర్థమైంది. ‘కీర్తి.. పర్వాలేదు నువ్వు నన్ను తిట్టు’ అని చెప్పాను. దానికి ఆమె.. ‘‘సార్.. నేను మిమ్మల్ని తిట్టలేను. ఒకవేళ నేను మిమ్మల్ని ఇప్పుడు తిడితే మీ ఫ్యాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు’’ అని కంగారుపడుతూ చెప్పింది. ‘‘నా ఫ్యాన్స్ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు" అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తి చేశాం. కానీ, మొన్న నా ఫ్యామిలీతో కలిసి ఆ సీన్ చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి, నవ్వింది.’’
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మ.. మ.. మహేశా సాంగ్‌పై మీ అనుభవం?
కీర్తి: ఈ సాంగ్‌లో ఒక స్టెప్పు ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా ఆయనతో కలిసి కో ఆర్డినేట్ చేయడం నాకు రాలేదు. చాలాసార్లు ఆయన ముఖంపై కొట్టేశా. రెండు, మూడు సార్లు అలా జరిగిన తర్వాత సార్ నా వద్దకు వచ్చి.. "నేను ఏదైనా తప్పు చేశానా’’ అని అడిగారు. ఆ స్టెప్పు ఎప్పటికీ మర్చిపోను. అలాగే మరో స్టెప్పు కూడా కొరియోగ్రాఫర్ చెప్పినట్టు నాకు చేయడం రాలేదు. దానికి ఆయన.. ‘‘సరే సరే. నువ్వు అలాగే చెయ్. నేను కూడా అలాగే చేస్తా" అని చెప్పారు.
మహేశ్: నేను చేసిన పాటల్లో మోస్ట్ ఎనర్జిటిక్ సాంగ్ ఇది. మొదటి రెండు రోజులు కష్టంగా అనిపించినా.. మూడోరోజు అదిరిపోయింది. సినిమా అనుకున్నప్పుడు, షూట్ చేసినప్పుడు ఈ సాంగ్ లేదు. కానీ, సినిమా మొత్తం పూర్తయ్యాక కాపీ చూసి.. ఇలాంటి ఒక పాట ఉంటే బాగుంటుందనిపించి, అప్పటికప్పుడు చేశాం. సాంగ్‌కి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఇదో మేజిక్‌లా ఉంది. ఇది నా కెరీర్‌లో బెస్ట్ సాంగ్.
ఇదీ చూడండి: ప్రశాంత్‌నీల్ మల్టీవర్స్.. 'కేజీఎఫ్ 2' సీక్వెల్స్‌గా 'సలార్', 'ఎన్టీఆర్ 31'?