ETV Bharat / entertainment

Sarkaru Vaari Paata: 'అది చూసి అంతా నిజమని అనుకున్నారు' - మహేశ్​బాబు సర్కారు వారి పాట ఆర్ట్ డైరెక్టర్​ ఏఎస్‌ ప్రకాష్‌

Maheshbabu Sarkaru vaari paata Art director: 'ఆర్య', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'శ్రీమంతుడు', 'అల.. వైకుంఠపురములో' లాంటి సూపర్​ హిట్​ సినిమాలకు తన కళా నైపుణ్యంతో ప్రాణం పోసిన కళా దర్శకుడు ఏఎస్‌ ప్రకాష్‌. తాజాగా ఆయన.. సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రానికి పనిచేశారు. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. ఆ విశేషాలివీ...

sarkaru vaari paata art director
మహేశ్​బాబు సర్కారు వారి పాట ఆర్ట్ డైరెక్టర్
author img

By

Published : Apr 26, 2022, 7:28 AM IST

Updated : Apr 26, 2022, 9:52 AM IST

Maheshbabu Sarkaru vaari paata Art director: "ఇప్పుడు కళా దర్శకులకు పేరుతో పాటు పని కూడా పెరిగింది. ప్రేక్షకులను మెప్పించేలా ఆర్ట్‌ వర్క్‌ చేయడం మరింత సవాల్‌గా మారింది" అన్నారు ఏఎస్‌ ప్రకాష్‌. 'ఆర్య', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'శ్రీమంతుడు', 'అల.. వైకుంఠపురములో'.. లాంటి ఎన్నో చిత్రాలకు తన కళా నైపుణ్యంతో ప్రాణం పోసిన కళా దర్శకుడాయన. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’కు పని చేశారు. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారాయన. ఆ విశేషాలు తన మాటల్లోనే.

మహేష్‌బాబుతో గతంలో ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శ్రీమంతుడు’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేశా. ‘సర్కారు వారి పాట’ మా కాంబినేషన్‌లో వస్తున్న ఏడో సినిమా. పరశురామ్‌ కథ చెప్పినప్పుడే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అనే విషయం అర్థమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే రంగంలోకి దిగాను. ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అన్న పేరు ఎందుకు పెట్టారన్నది సినిమా ఆరంభంలోనే తెలిసిపోతుంది.

కథ కోసం మాకు మూడు బ్యాంక్‌ సెట్లు అవసరమయ్యాయి. అందులో ఒకటి 50ఏళ్ల క్రితం నాటి సెట్‌. అప్పట్లో బ్యాంకులు ఎలా ఉండేవి? అందులో ఫర్నీచర్‌ ఎలా ఉండేది? ఇలాంటివన్నీ తెలుసుకొని రూపొందించాం. ఈ సెట్లో పలు కీలక సన్నివేశాలతో పాటు ఓ పెద్ద యాక్షన్‌ సీన్‌ చిత్రీకరించారు. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా మరో రెండు బ్యాంక్‌ సెట్లు నిర్మించాం. దీని కోసం మేం చాలా పరిశోధన చేశాం. చాలా ప్రాంతాలు తిరిగాం. హైదరాబాద్‌లో వైజాగ్‌ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ స్ట్రీట్‌ సెట్‌ వేశాం. గోవాలో ఓ భారీ సెట్‌ నిర్మించాం.

ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. అందరూ మన చిత్రాల్ని చూస్తున్నారు. దాంతో మా బాధ్యత మరింత పెరిగింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లో ఆర్ట్‌ వర్క్‌కు ప్రాధాన్యత బాగానే ఉండేది. మధ్యలో కాస్త తగ్గింది. ఇప్పుడు మళ్లీ పెరిగింది. గతంలో పాట, ఫైటు కోసం విదేశాలకు వెళ్తుండేవారు. ఇప్పుడు వాటిని కూడా సాధ్యమైనంత వరకు సెట్లలోనే పూర్తి చేస్తున్నారు. ‘అల వైకుంఠపురంలో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలకు నేనే ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. ఆ రెండు సినిమాలు ఎక్కువ శాతం సెట్లోనే చిత్రీకరించారు. కానీ, ప్రేక్షకులు తెరపై చూస్తున్నప్పుడు నిజమైన లొకేషన్‌లోనే షూట్‌ చేశారనుకున్నారు. ప్రేక్షకుల్ని అలా నమ్మించేలా చేయడమే మాకు అవార్డుతో సమానం.

ప్రస్తుతం చిరంజీవితో ‘భోళా శంకర్‌’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలకు.. బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని సినిమాకు, త్రివిక్రమ్‌ - మహేష్‌బాబు చిత్రానికి పనిచేస్తున్నా.

ఇదీ చూడండి: మహేశ్ ​బాబును ఇంటికి రావొద్దన్న చిరంజీవి.. ఎందుకో తెలుసా?

Last Updated : Apr 26, 2022, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.