ETV Bharat / entertainment

మహేశ్‌-త్రివిక్రమ్‌ మూవీ.. అప్డేట్ వచ్చేసింది..​ - మహేశ్‌ త్రివిక్రమ్‌ మూవీ

Mahesh Trivikram movie: మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకు సంబంధించిన అప్డేట్​ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం చెప్పింది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయని, ఆగస్టు నుంచి సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు వెల్లడించింది.

Mahesh trivikram movie update
మహేశ్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఇంట్రెస్టింగ్‌ అప్డేట్​
author img

By

Published : Jul 9, 2022, 12:06 PM IST

Updated : Jul 9, 2022, 3:59 PM IST

Mahesh Trivikram movie: ఎప్పుడెప్పుడా అని సూపర్‌స్టార్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే అప్డేట్​ వచ్చేసింది. మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సిద్ధం కానున్న హ్యాట్రిక్‌ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్​ అప్డేట్​ను ప్రకటించింది మూవీటీమ్​. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయని, ఆగస్టు నుంచి సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు వెల్లడించింది. మరోవైపు సంగీత దర్శకుడు తమన్‌ సైతం.. "తెల్లవారుజాము నుంచే మహేశ్‌-త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ ప్రారంభించా" అంటూ పోస్ట్‌ పెట్టారు. చిత్రబృందం నుంచి వచ్చిన లేటెస్ట్‌ అనౌన్స్‌మెంట్‌తో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. #SSMB28గా ఇది ప్రచారంలో ఉంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. ఇందులో మహేశ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: యాక్షన్​ సీక్వెన్స్​లో అలియా.. హాలీవుడ్​ మూవీ వర్కింగ్​ స్టిల్స్​ లీక్

Last Updated : Jul 9, 2022, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.