ETV Bharat / entertainment

మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ వర్క్స్​ షురూ!- ప్రిన్స్ జర్మనీ ట్రిప్ సీక్రెట్ అదే! - Guntur Kaaram Collections

Mahesh Babu Rajamouli Movie: టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్​బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేశ్ తాజాగా జర్మనీ వెళ్లినట్లు సమాచారం.

Mahesh Babu Rajamouli Movie
Mahesh Babu Rajamouli Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 7:37 AM IST

Updated : Jan 19, 2024, 7:55 AM IST

Mahesh Babu Rajamouli Movie: సూపర్​స్టార్ మహేశ్​బాబు రీసెంట్​గా 'గుంటూరు కారం' సినిమాతో ఆడియెన్స్​ను అలరించారు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా డీసెంట్​ టాక్​తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేశ్, దర్శకధీరుడు రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ ఫ్యాన్స్​తో సహా, టాలీవుడ్​లో అందరి చూపు ఈ ప్రాజెక్ట్​పైనే ఉంది. ఈ నేపథ్యంలో మహేశ్ తాజాగా హైదరాబాద్ ఎయిర్​పోర్టులో కనిపించారు. ఆయన ఒంటరిగా జర్మనీ వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే మహేశ్​బాబు సడెన్​గా జర్మనీ వెళ్లడంపై ఆయన ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా కోసమే మహేశ్ జర్మనీ వెళ్లారట. టెక్నికల్ వర్క్స్​ (Technical Work) కోసం ప్రిన్స్ అక్కడికి వెళ్లినట్లు ఇన్​సైట్ టాక్ వినిపిస్తోంది. దీంతో మహేశ్- రాజమౌళి సినిమా పనులు ప్రారంభమైనట్లేనని సూపర్​స్టార్ ఫ్యాన్స్​ ఫుల్ ఖుషీగా ఉన్నారు. రాజమాళి ఈ సినిమాను దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్​తో, రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది. ఇక మూడు రోజుల్లో జర్మనీ నుంచి మహేశ్ రిటర్న్ అవ్వనున్నారు. ఆయన భారత్​కు వచ్చాక గుంటూరు కారం సినిమా సక్సెస్ మీట్ ఉంటుందని సమాచారం.

గుంటూరు కారం విషయానికొస్తే: మహేశ్​బాబు- శ్రీలీల లీడ్ రోల్స్​లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే వరల్డ్​వైడ్​గా రూ.160+ కోట్ల గ్రాస్​ వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో మహేశ్ కెరీర్​లో వరుసగా ఐదోసారి రూ.100 కోట్ల షేర్ అందుకున్నారు. ఇదివరకు 'భరత్‌ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' సినిమాలతో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్​ఫ్లిక్స్​ భారీ ధరకు దక్కించుకుందట. మార్చి ఆఖరి వారం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించింది. ఇక మాటల మాటల మాంత్రికుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. హారికా అండ్ హసిన్ క్రియేషన్స్ బ్యానర్​పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'గుంటూరు కారం' రూ.100 కోట్లు - మహేశ్ ఖాతాలోకి ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డ్​!

సంక్రాంతి బరిలో సౌత్​ సినిమాలు - కలెక్షన్స్​లో టాప్​ ఏదంటే ?

Last Updated : Jan 19, 2024, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.