ETV Bharat / entertainment

కమల్​హాసన్​పై మహేశ్​బాబు ట్వీట్​.. ఇంకా అర్హత రాలేదంటూ! - మహేశ్​బాబు కమల్​హాసన్​

Mahesh Babu praises Kamalhassan: దిగ్గజ నటుడు కమల్​హాసన్​ గురించి సూపర్​స్టార్​​ మహేశ్​బాబు ఓ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం అది వైరల్​గా మారింది. ఏమన్నారంటే?

Kamalhassan Mahesh babu tweet
కమల్​హాసన్​ మహేశ్​బాబు
author img

By

Published : Jul 3, 2022, 10:41 AM IST

Mahesh Babu praises Kamalhassan: యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ నటించిన 'విక్రమ్'​ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్​బస్టర్​ హిట్​ను అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్​ ముందు అదరగొట్టింది. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు మూవీ అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్​స్టార్​ మహేశ్​బాబు చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. 'ఏ న్యూ ఏజ్​ కల్ట్​ క్లాసిక్' అని ట్వీట్ చేశారు.

"బ్లాక్​బస్టర్​ సినిమా. మైండ్​ బ్లోయింగ్​. అదిరిపోయింది. లోకేశ్​ కనగరాజ్​.. నేను మిమ్మల్ని కలిసి.. విక్రమ్​ మొదలైనప్పటినుంచి చివరి వరకు చిత్రీకరణ ఎలా జరిగిందో తెలుసుకుంటా. ఇక లెజెండరీ యాక్టర్​ కమల్​హాసన్​ నటన గురించి మాట్లాడే అర్హత నాకు ఇంకా రాలేదు! నా అనుభవం కూడా సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆయన అభిమానిని అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇందులో ఫహద్​ ఫాజిల్​, విజయ్​ సేతుపతి నటనలో మెరుపులు కనిపించాయి. ఇక అనిరుధ్​ కెరీర్​ బెస్ట్​ మ్యూజిక్​ అందించారు" అంటూ మహేశ్​ రాసుకొచ్చారు.

Mahesh Babu praises Kamalhassan
కమల్​హాసన్​ విక్రమ్​పై మహేశ్​ ప్రశంసలు

కాగా, విక్రమ్​ సినిమా బాక్సాఫీస్​ వద్ద మరో సూపర్​ రికార్డును అందుకుంది. తాజాగా 400కోట్ల క్లబ్​లో చేరింది. సూపర్​స్టార్​ రజనీకాంత్​ నటించిన 'రోబో 2.0' తర్వాత ఈ అరుదైన ఘనత రెండొవ తమిళ చిత్రంగా నిలిచింది.

ఇదీ చూడండి: అలా ఉండాలంటే చాలా భయం.. కానీ: శ్రుతిహాసన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.