ETV Bharat / entertainment

Mahesh Babu Flop Movie : సినిమా ఫ్లాఫ్​ అయితే ఏం చేయాలో నాన్న దగ్గర నేర్చుకున్నాను! : మహేశ్​బాబు - Mahesh Rajamouli Movie

Mahesh Babu Flop Movie : సూపర్​ స్టార్ మహేశ్​ బాబు తాజాగా ఓ ప్రెస్​ మీట్​లో పలు ఆసక్తికర విషయాలను మాట్లాడారు. తన తండ్రి దివంగత నటుడు సూపర్ స్టార్​ కృష్ణను గుర్తుచేసుకున్నారు. ఏం మాట్లాడారంటే?

Mahesh Babu on Challenges :  సినిమా ఫ్లాఫ్​ అయినప్పుడు ఏం చేయాలో నాన్న దగ్గర నేర్చుకున్నాను : మహేశ్​బాబు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 12:23 PM IST

Mahesh Babu Flop Movie : సూపర్ స్టార్ మహేశ్​ బాబు టాలీవుడ్​లో ఎంత పెద్ద హీరోనో తెలిసిన విషయమే. ప్రతీ సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ కెరీర్​లో ఉన్నత స్థాయికి ఎదిగారు. అయితే ఎంతటి స్టార్ యాక్టర్​ అయినా సరే.. కథలు, పాత్రలు, సినిమాలు, వాటి రిజల్ట్​ విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయం గురించి మాట్లాడారు మహేశ్​బాబు. స్టార్‌ అయితే ఒత్తిడిని అంగీకరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మహేశ్‌-నమ్రత దంపతులు హాజరై సందడి చేశారు. అక్కడే మహేశ్​.. తన కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మాట్లాడారు. తన తండ్రి దివంగత నటుడు సూపర్ స్టార్​ కృష్ణను గుర్తుచేసుకున్నారు.

"నేను నటించిన చిత్రాలు ఫెయిల్ అయినప్పుడు నిరుత్సాహ పడతాను. ఎందుకంటే ఒక చిత్రంపై ఎన్నో అంచనాలు ఉంటాయి. దాని వెనక ఎంతో మంది కష్టం దాగి ఉంటుంది. దాని పూర్తి రెస్పాన్సిబులిటీ నేనే తీసుకుంటాను. అలాగే తర్వాతి చిత్రం ఎక్కువ ఫోకస్ చేస్తాను. మనం స్టార్‌ హీరో అయితే ఒత్తిడిని అంగీకరించాల్సిందే. ఈ విషయం నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన నాకు చెప్పేవారు. క్రమశిక్షణ, వినయం.. వంటి వాటి ప్రాముఖ్యత గురించి కూడా నేర్పించారు. విజయం ఒక్కసారిగా రాదు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటేగానీ వస్తుందని అన్నారు." అంటూ మహేశ్‌ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.

Mahesh Trivikram Movie : ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో గుంటూరు కారం అనే మాస్​ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా చేస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రానున్న చిత్రమిది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమాలో మహేశ్‌కు జోడీగా హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సేషనల్​ మ్యూజిక్ డైరెక్టర్​ తమన్‌ స్వరాలు అందించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్​పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Mahesh Rajamouli Movie : దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్ట్​ చేస్తున్నారు మహేశ్. అడ్వెంచర్ నేపథ్యంలో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Boyapati Srinu Upcoming Movies : బోయపాటి లైనప్‌... మహేశ్​-సూర్యతో సినిమా.. ఎప్పుడంటే?

Prabhas Lokesh Kanagaraj Movie : LCUలో ప్రభాస్​ చిత్రం భాగమా కాదా.. లోకేశ్ ఆన్సర్​ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.