ETV Bharat / entertainment

దుబాయ్​లో మహేశ్​ కాస్ట్లీ విల్లా.. ట్రిప్​ వేసింది అందుకేనట! - మహేశ్​ బాబు ఎస్​ఎస్​ఎంబీ 28

Mahesh Babu Dubai Villa : టాలీవుడ్​ సూపర్​ స్టార్ మహేశ్​ బాబు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. కాస్త విరామం దొరికినా ఫారిన్​ ట్రిప్​లకు చెక్కేసే మహేశ్​.. తాజాగా దుబాయ్​ వెళ్లారు. అయితే, ఈ పర్యటన గురించి సోషల్​ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన దుబాయ్​లో ఓ ఖరీదైన ప్రాపర్టీ కొన్నారని తెలుస్తోంది. దాని రిజిస్ట్రేషన్​ కోసమే అక్కడికి వెళ్లారని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు..

mahesh babu dubai villa
mahesh babu dubai villa
author img

By

Published : May 1, 2023, 10:41 AM IST

Mahesh Babu Dubai Villa : టాలీవుడ్ సూపర్​ స్టార్​ మహేశ్​​ బాబుకు విహారయాత్రలు అంటే ఇష్టమని అందరికీ తెలుసు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ హీరో కొంచెం గ్యాప్​ దొరికినా.. కుటుంబంతో సహా టూర్​లకు వెళతారు. ఇప్పటికే ఆయన పారిస్, జర్మనీ ట్రిప్​లకు వెళ్లొచ్చారు. తాజాగా మరోసారి విదేశీ యాత్ర చేపట్టారు మహేశ్​. ఈసారి ఎడారి దేశం దుబాయ్​కు వెళ్లారు. అయితే, మహేశ్​ దుబాయ్​ ట్రిప్​పై సోషల్​ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటు సినిమాలు, అటు వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్న ఈ హీరో.. దుబాయ్​లో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఇండిపెండెంట్​ విల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ కోసమే దుబాయ్​ వెళ్లారని వార్తలు వస్తున్నాయి. ఈ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ రెండు రోజులు జరగనుందని టాక్​ వినిపిస్తోంది. అయితే, ఈ విషయానికి సంబంధించి మహేశ్ బాబు​ అధికారికంగా స్పందించలేదు.

గతేడాది మే 12న సర్కారు వారి పాట సినిమా విడుదలైంది. అప్పటి నుంచి మహేశ్​ థియేటర్లలో సందడి చేయలేదు. ప్రస్తుతం ఈ స్టార్​ హీరో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో SSMB 28 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాకు కొన్ని అడ్డంకులు తప్పేలా లేవు. ఇందుకు కారణం హీరో మహేశ్​, త్రివిక్రమ్​ల మధ్య సఖ్యత​ లోపించిందనే కారణం మాత్రం ఫిల్మ్​ నగర్​ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారమైతే జరుగుతోంది. కానీ ఈ గాసిప్స్​ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొట్టిపారేశారు. అటువంటిది ఏమిలేదని డైరెక్టర్​, హీరోల మధ్య బాండింగ్​ బాగానే ఉందని చెబుతున్నారు. అయితే తాజాగా మహేశ్​ ఫారిన్​ టూర్​కు వెళ్లడం వల్ల ఈ మూవీ షూటింగ్​ షెడ్యూల్​ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, మహేశ్​ తాజా ట్రిప్​తో వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయిందని సినీ క్రిటిక్స్​ అంటున్నారు

'SSMB 28'లో మూడో సారి కలసి పనిచేస్తున్నారు మహేశ్​, త్రివిక్రమ్​. అంతకుముందు.. ఈ ఇద్దరి కాంబినేషన్​లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' బ్లాక్​బస్టర్లుగా నిలిచాయి. ఇక ఈ చిత్రంలో మహేశ్​ సరసన పూజా హెగ్డే రెండో సారి ఆడిపాడనుంది. 2019లో వచ్చిన మహర్షి సినిమాలో మహేశ్​తో ఓ సారి స్క్రీన్​ షేర్​ చేసుకుందీ బ్యూటీ. ఈ సినిమాలో శ్రీలీల, రమ్య క్రిష్ణన్, ప్రకాశ్​ రాజ్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నవిన్​ నూలీ ఎడిటర్​గా వ్యవహరిస్తుండగా తమన్ ఎస్​ సంగీతం సమకూరుస్తున్నారు. కొరియోగ్రాఫర్​గా రామ్​-లక్ష్మణ్, సినిమాటోగ్రాఫర్​గా పీఎస్​ వినోద్​, ఆర్ట్​ డైరెక్టర్​ ఏఎస్​ ప్రకాశ్​ పనిచేస్తున్నారు. ​ఈ సినిమా పూర్తైన తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళితో 'SSMB 29' చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.