Mahesh Babu Birthday Namrata Shirodkar Wishes : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆగస్ట్ 9న.. 48వ ఏట అడుగుపెట్టారు. ఐదు పదుల వయసుకు చేరువలో ఉన్నప్పటికీ వన్నె తరగని క్రేజ్‌తో ఉన్న ఈ స్టార్ హీరో తన చిరునవ్వుతో అమ్మాయిల మనసులు దోచేస్తున్నారు. నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ అందరి మన్ననలు పొందుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు పర్సెనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ.. జెంటిల్మెన్ అనిపించుకుంటున్నారు. ఇక బుధవారం తన బర్త్‌డే సందర్భంగా మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ చెప్తున్నారు. 'హ్యాపీ బర్త్‌డే అన్నా' అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
Namrata Wishes To Mahesh Babu : మహేశ్ బర్త్‌డే సందర్భంగా ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ స్పెషల్ విషెస్ చెప్పారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మహేశ్, నమ్రత ఉన్న ఓ పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. "హ్యాపీ బర్త్ డే ఎంబీ!! ఈ రోజు, ప్రతి రోజూ నువ్వే, నువ్వే" అంటూ స్వీట్‌గా విష్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా ఈ ఫొటో కింద కామెంట్ల రూపంలో మహేశ్‌కు విషెస్ చెప్తున్నారు.
థియేటర్లలో సూర్య భాయ్ సందడి..
Business Man Re Release : మరోవైపు మహేశ్ బాబు బర్త్‌డే స్పెషల్‌గా ఆయన నటించిన 'బిజినెస్మెన్' మూవీని 4కేలో రీరిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో సందడి చేస్తోంది. బుకింగ్స్‌లోనే ఈ రికార్డులు క్రియేట్ చేసినట్టుగా టాక్ నడుస్తోంది. గత ఏడాది బర్త్‌డేకు 'పోకిరి' సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ప్రారంభించింది. మళ్లీ ఇప్పుడు బిజినెస్ మెన్ కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉందని అభిమానులు సంబరాలు చేస్తుకుంటున్నారు.
ఆ రెండు కూడా..
Mahesh Babu Birthday Trend : ఇక ట్విట్టర్లో 'హ్యాపీ బర్త్‌డే అన్నా' అనే హ్యాష్ ట్యాగ్‌తో 'SSMB 29', 'గుంటూరు కారం' కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. బుధవారం తెల్లవారుజామన గుంటూరు కారం మూవీ టీమ్ మహేశ్ బాబు బర్త్‌డే స్పెషల్‌గా ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గళ్ల లుంగీ కట్టుకుని, బీడి వెలిగిస్తున్న మహేశ్.. ఊరమాస్ లుక్‌లో కనిపించారు. ఇదిలా ఉండగా.. రాజమౌళి- మహేశ్ కాంబోలో రానున్న 'SSMB 29' గురించి ఏదైనా అప్డేట్ రాకపోతుందా అంటూ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకే 'SSMB 29' హ్యాష్ ట్యాగ్‌ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
-
Wishing a spectacular Happy Birthday to the Reigning Superstar, @urstrulymahesh garu! 🤩#HBDSuperstarMaheshBabu ✨
— Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Your unparalleled on-screen brilliance coupled with your genuine off-screen humility continues to set a remarkable standard of inspiration 🌟🎉… pic.twitter.com/INkV4ZtJK4
">Wishing a spectacular Happy Birthday to the Reigning Superstar, @urstrulymahesh garu! 🤩#HBDSuperstarMaheshBabu ✨
— Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023
Your unparalleled on-screen brilliance coupled with your genuine off-screen humility continues to set a remarkable standard of inspiration 🌟🎉… pic.twitter.com/INkV4ZtJK4Wishing a spectacular Happy Birthday to the Reigning Superstar, @urstrulymahesh garu! 🤩#HBDSuperstarMaheshBabu ✨
— Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023
Your unparalleled on-screen brilliance coupled with your genuine off-screen humility continues to set a remarkable standard of inspiration 🌟🎉… pic.twitter.com/INkV4ZtJK4
Guntur Kaaram Mahesh Poster : మాస్ లుక్‌లో మహేశ్ సర్ప్రైజ్.. గళ్ల లుంగీతో కొత్త పోస్టర్..