ETV Bharat / entertainment

Mahadev Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో కమెడియన్​ కపిల్ శర్మ, నటి హ్యూమా ఖురేషికి ఈడీ సమన్లు.. - మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్

Mahadev Betting App Case : మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో హాస్యనటుడు కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌లకు ఈడీ సమన్లు జారీచేసింది. బాలీవుడ్ నటుడు రణ్​బీర్ కపూర్​కు సమన్లు జారీ చేసిన మరుసటి రోజే వీరికి సమన్లు జారీ చేయడం గమనార్హం.

Mahadev Betting App Case
Mahadev Betting App Case
author img

By PTI

Published : Oct 5, 2023, 8:55 PM IST

Updated : Oct 5, 2023, 10:49 PM IST

Mahadev Betting App Case : మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో హాస్యనటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌లకు ఈడీ గురువారం సమన్లు జారీచేసింది. బాలీవుడ్ నటుడు రణ్​బీర్ కపూర్​కు సమన్లు జారీ చేసిన మరుసటి రోజే వీరికి సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ మనీలాండరింగ్​ కేసు విచారణకు సంబంధించి కమెడియన్​ కపిల్​ శర్మతో పాటు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌లను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపినట్లు అధికారులు తెలిపారు.

  • ED has summoned comedian Kapil Sharma and actor Huma Qureshi in connection with the Mahadev betting app case: ED Sources

    (file pics) pic.twitter.com/rKXxUgtucl

    — ANI (@ANI) October 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాగా, ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్​ నటుడు రణ్​బీర్ కపూర్​కు అక్టోబర్​ 4న సమన్లు జారీ చేసింది ఈడీ. ఇందులో అక్టోబర్​ 6న రాయ్‌పుర్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు. అయితే అందుకు రణ్​బీర్​ రెండు వారాల సమయం కోరినట్లు సమాచారం.

కాగా.. బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న భారీ స్కామ్​ను ఈడీ ఇటీవల బయటపెట్టింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్‌ చంద్రఖర్‌, రవి ఉప్పల్‌ యూఏఈలోని దుబాయ్‌ కేంద్రంగా దేశంలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. అయితే, వీరు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ బెట్టింగ్‌ యాప్‌ పెద్ద ఎత్తున యాడ్స్​ కోసం ఖర్చు చేసినట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల కోల్‌కతా, భోపాల్‌, ముంబయి సహా ఇతర ప్రధాన నగరాల్లో సోదాలు నిర్వహించి.. మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.

ఇతర సెలబ్రిటీల పేర్లు..
ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపించాయి. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల్లో ఒకరి పెళ్లికి వీరు హాజరవ్వడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రఖర్‌ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ వివాహానికి బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, సన్నీ లియోనీ, నేహా కక్కర్‌, అతిఫ్‌ అస్లమ్‌, రహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్‌, అలీ అస్గర్‌, విశాల్‌ దద్లానీ తదితర ప్రముఖులు హాజరయినట్లు తెలిసింది. వీరి కోసం ప్రత్యేకంగా ఓ ప్రైవేటు జెట్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆ వేడుకకు హాజరైన సినీతారలపై ఈడీ దృష్టి సారించింది.

Mahadev Betting App Case Ranbir Kapoor : బాలీవుడ్ హీరో రణ్​బీర్​ కపూర్​కు ఈడీ సమన్లు.. ఆ కేసులోనేనట..

Vaani Kapoor Latest Photos : నాని హీరోయిన్​ హైడోస్​ గ్లామర్ షో​.. బికినీలో మంటలు రేపుతూ!

Last Updated : Oct 5, 2023, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.