- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'. మాధవన్ ప్రధానపాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్‌ఇండియా చిత్రమిది. సిమ్రన్ కథానాయిక. సామ్ సి.ఎస్ స్వరాలందిస్తున్నారు. గురువారం ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేశారు.
నటుడు సూర్య (హిందీలో షారుఖ్‌ఖాన్ ఈ పాత్ర చేశారు).. నంబి నారాయణ్ పాత్ర పోషిస్తున్న మాధవన్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఓ వీధి కుక్కను కొట్టి చంపాలంటే దానికి పిచ్చి అనే పటం కడితే సరిపోతుంది. అదే విధంగా ఒక మనిషిని తలెత్తనివ్వకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పటం కడితే సరిపోతుంది' అంటూ సూర్య చెప్పే సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 'నేను ఒక క్యారెక్టర్ సర్టిఫికెట్ కోసమో.. పాపులారిటీ కోసమో రాలేదు.. ఒక మిషన్ కోసం వచ్చా' అంటూ మాధనవ్ పలికే సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి.
భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణన్ ఒకరు. ఒకానొక సమయంలో ఆయన దేశ ద్రోహం కేసును ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే 50రోజులు జైల్లో గడిపారు. తర్వాత ఆయనపై వేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కొట్టి వేసింది. ఇలా ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఆయన జీవితాన్ని మాధవన్ ఆవిష్కరిస్తున్నారు.
ఇదీ చూడండి: 'వైల్డ్ డాగ్' మేకింగ్ వీడియో చూశారా?