Lokesh Kanagaraj Khaidi : అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న మూవీ ఖైదీ. ఈ సినిమాతో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన సత్తా చాటి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లారు. కార్తి మార్క్ యాక్టింగ్ ఈ సినిమాకు భారీ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తమిళ నటుడు నరైన్ 'ఖైదీ'కి సంబంధించిన ఓ తాజా అప్‌డేట్ ఇచ్చారు. ఎవ్వరూ ఊహించని ఓ అప్డేట్ను ఆయన అందించారు.
తన కొత్త సినిమా 'క్వీన్ ఎలిజబెత్' ప్రమోషన్స్ కోసం చెన్నైలోని ఓ కాలేజీకి వెళ్లారు నరైన్. అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలో 'ఖైదీ 2' అప్‌డేట్ ఇవ్వాలంటూ స్టూడెంట్స్ కోరారు. దీంతో ఆయన అసలు విషయం చెప్పుకొచ్చారు. తాను, లోకేశ్ కనగరాజ్ కలిసి 'లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్'కి సంబంధించి ఓ షార్ట్ ఫిల్మ్‌ను పూర్తిచేశామని ఆయన తెలిపారు. అది 'ఖైదీ' సినిమాకు ప్రీక్వెల్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌తో తీయనున్న సినిమా పనుల్లో లోకేశ్ బీజీగా ఉన్నారని, అది పూర్తయిన వెంటనే 'ఖైదీ 2' షూటింగ్ మొదలవుతుందని చెప్పారు.
మరోవైపు ఇదే విషయం గురించి కార్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే వచ్చే జనవరిలో షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ రజనీ- లోకేశ్ మూవీ ఓకే అయినందునఈ సినిమాను ఇంకొన్ని రోజులు వాయిదా వేశామంటూ కార్తి చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్ తర్వాత కచ్చితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
" రోలెక్స్ కోసం నేనూ వెయిటింగ్ (నవ్వుతూ). చర్చలు జరుగుతున్నాయి. రోలెక్స్ గురించి ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. దీని గురించి అన్నయ్య, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ని అడగాలి. ఓ బలమైన పాత్ర, నేపథ్యం ఉన్నప్పుడు సీక్వెల్‌ను ముందుకు తీసుకెళ్లవచ్చు. 'ఖైదీ', 'సర్దార్'కి అది ఉంది. అందుకే ఆ ప్రాజెక్టులకు సీక్వెల్స్ వస్తున్నాయి." అని కార్తి చెప్పుకొచ్చారు.
Lokesh Kanagaraj And Vijay Sethupathi : LCUలో మళ్లీ సంతానం పాత్ర ఉంటుందా?.. లోకేశ్ ఆన్సర్ ఇదే
కార్తి లైనప్‌లో భారీ బడ్జెట్ మూవీస్ - ఇది సాధిస్తే ఓ రేర్ రికార్డు ఖాయం!