ETV Bharat / entertainment

Lokesh Kanagaraj And Vijay Sethupathi : LCUలో మళ్లీ సంతానం పాత్ర ఉంటుందా?.. లోకేశ్ ఆన్సర్ ఇదే - సంతానం పాత్రపై లోకేశ్ కనగరాజ్ క్లారిటీ

Lokesh Kanagaraj And Vijay Sethupathi : ఎల్​సీయూలో భాగంగా తర్వాత రాబోయే చిత్రాల్లో విజయ్ సేతుపతి సంతానం పాత్ర కంటిన్యూ అవుతుందా లేదా అనే విషయంపై స్పష్టత ఇచ్చారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఏం చెప్పారంటే?

Lokesh Kanagaraj And Vijay Sethupathi : LCUలో మళ్లీ సంతానం పాత్ర ఉంటుందా?.. లోకేశ్ ఆన్సర్ ఇదే

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 10:23 AM IST

Lokesh Kanagaraj And Vijay Sethupathi : గతేడాది విడుదలైన 'విక్రమ్‌' సినిమా ఎంతటి బ్లాక్​ బస్టర్​ అయిందో తెలిసిన విషయమే. లోకేశ్​ టేకింగ్‌, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌కు ప్రతీ ప్రేక్షకుడు ఫిదా అయిపోయారు. ఈ చిత్రం కేవలం తమిళంలోనే కాదు ఇతర భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించింది. వందల కోట్లను కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రంలో విక్రమ్‌గా కమల్ హాసన్​ పాత్రకు ఎంతటి విశేష ఆదరణ దక్కిందో.. సంతానంగా విజయ్ సేతుపతి పాత్ర కూడా అంతే ఆకట్టుకుంది. అయితే తాజాగా ఎల్​సీయూలో భాగంగా తర్వాత రాబోయే చిత్రాల్లో విజయ్ సేతుపతి సంతానం పాత్ర కంటిన్యూ అవుతుందా లేదా అనే విషయంపై స్పష్టత ఇచ్చారు లోకేశ్ కనగరాజ్.

'విక్రమ్' చిత్రంలో విజయ్ సేతుపతి చేసిన సంతానం పాత్ర.. పూర్తి నెగిటివ్​గా, వైలెన్స్​తో ఉంటుంది. లోకల్​గా డ్రగ్స్ మాఫియాను శాసించే వ్యక్తిగా ఆయన కనిపించారు. అయితే అసలీ పాత్రను మొదట రాఘవ లారెన్స్ పోషించాల్సింది. కానీ ఆ తర్వాత సంతానం పాత్ర విజయ్​​ సేతుపతి దగ్గరికి వెళ్లడం, అది ఆయన నటించడం, ప్రేక్షకులకు తెగ నచ్చేయడం జరిగింది.

విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా చాలా చిత్రాల్లో కనిపించారు కానీ.. ఈ చిత్రంలోని సంతానం విలన్​ పాత్ర వేరే లెవెల్ అనే చెప్పాలి. అంతలా భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ పాత్రకు సపరేట్‌ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఎక్కడా చూసిన ఈ పాత్ర రీల్సే కనిపించాయి. నెగెటివ్ రోలే అయినప్పటికీ.. ఆడియెన్స్​కు బాగా కనెక్ట్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే సంతానంగా విజయ్​ నటించారు అని అనడం కన్నా జీవించారనే చెప్పాలి. అయితే ఈ విక్రమ్​ చిత్రం చివర్లో సంతానం పాత్ర కథ ముగుస్తుంది. విక్రమ్​ చంపేసినట్టుగా చూపిస్తారు. కానీ దాన్ని క్లారిటీగా చూపించరు.

అయితే ఈ పాత్ర ఎల్​సీయూలోని రాబోయే చిత్రాల్లో ఉంటే బాగుంటుందని చాలా మంది సినీ ప్రియులు ఆశించారు. కానీ ఆ పాత్ర ఇక ఉండదని తాజాగా లోకేశ్ కనగరాజ్ స్పష్టత ఇచ్చేశారు. విక్రమ్​ 2లో కమల్​ ఎదుర్కొనబోయే పాత్ర మరింత బలంగా, బ్రాండింగ్​గా ఉంటుందని చెప్పారు. ఆ ప్రతినాయకుడి పాత్ర.. డ్రగ్స్ సామ్రాజ్యాన్ని మళ్లీ పునఃనిర్మించి సూర్య రోలెక్స్ వైల్డ్​ రోల్​కు​ సహాయంగా ఉంటుందని అన్నారు. త్వరలోనే ఆ పాత్ర కోసం ఇతర నటులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Devara Janvi Kapoor Look : జాన్వీ పాత్ర ఇదే.. లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా.. తారక్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

2023 Top 5 Movies : టాప్​ 5 లిస్ట్​లో 'లియో', 'జైలర్​'​.. మరి 'సలార్​' నిలుస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.