Little Girl Dances To Kaavaalaa Song Viral Video : సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ 'జైలర్' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రిలీజైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. దీంతో ఎక్కడ చూసినా ఇప్పుడు రజనీ మేనియానే నడుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకంటే ముందు నుంచే ట్రైలర్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. అందులో 'కావాలయ్య' సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిరుధ్ తన మ్యూజిక్‌తో ఈ సూపర్ సాంగ్ క్రియేట్ చేయగా.. దానికి తమన్నా వేసిన స్టెప్పులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.
Jailer Kavalayya Song : ఇక రిలీజైన కొద్ది నిమిషాల్లోనే ఈ సాంగ్ నెట్టింట తెగ వైరలైపోయింది. ఇన్‌స్టా రీల్స్‌తో పాటు యూట్యూబ్ షార్ట్స్‌తో ఈ సాంగ్ ట్రెండ్ సృష్టించింది. చిన్నపెద్దా అని తేడా లేకుండా ఎవరు చూసిన కావాలయ్యా అంటూ స్టెప్పులు వేయడం మొదలెట్టారు. సిమ్రాన్, రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్స్ కూడా ఈ సాంగ్‌కు డ్యాన్స్ వేసి సందడి చేశారు. ఇప్పటికే పలువురు ఈ సాంగ్‌కు తమన్నా హుక్ స్టెప్పులేసి అదరగొట్టగా.. తాజాగా ఓ చిన్నారి వేసిన డ్యాన్స్ ఇప్పుడు అందరి మనసులు దోచేస్తోంది.
cutiepie_riva అనే ఇన్‌స్టా అకౌంట్లో ఉన్న ఆ వీడియో ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. చూస్తుంటే ఆ సరిగ్గా నాలుగేళ్ల వయసు కూడా ఉండదు. అయినప్పటికీ తమన్నా స్టైల్లో డ్యాన్స్ వేస్తూ అదరగొట్టింది. సాంగ్‌కు అనుగుణంగా హావభావాలు పలికి అందరి చేత ఔరా అనిపించింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారి డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు. ఇన్‌స్టా వేదికాగా ఆ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇలానే పలువురు ఈ 'కావాలయ్యా' సాంగ్‌కు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఇటీవలే జపాన్ రాయభారి హిరోషి సుజుకీ సైతం ఈ సాంగ్‌కు స్టెప్పులేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ వీడియోను హిరోషీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. "జపనీస్ యూట్యూబర్ మాయో శాన్‌తో కలిసి కావాలయ్యా డ్యాన్స్ వీడియో. రజనీకాంత్‌పై నా ప్రేమ కొనసాగుతుంది" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
-
Kaavaalaa dance video with Japanese YouTuber Mayo san(@MayoLoveIndia)🇮🇳🤝🇯🇵
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
My Love for Rajinikanth continues … @Rajinikanth #Jailer #rajinifans
Video courtesy : Japanese Youtuber Mayo san and her team pic.twitter.com/qNTUWrq9Ig
">Kaavaalaa dance video with Japanese YouTuber Mayo san(@MayoLoveIndia)🇮🇳🤝🇯🇵
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) August 16, 2023
My Love for Rajinikanth continues … @Rajinikanth #Jailer #rajinifans
Video courtesy : Japanese Youtuber Mayo san and her team pic.twitter.com/qNTUWrq9IgKaavaalaa dance video with Japanese YouTuber Mayo san(@MayoLoveIndia)🇮🇳🤝🇯🇵
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) August 16, 2023
My Love for Rajinikanth continues … @Rajinikanth #Jailer #rajinifans
Video courtesy : Japanese Youtuber Mayo san and her team pic.twitter.com/qNTUWrq9Ig
Rajinikanth Jailer collections : 'జైలర్' రూ.500+కోట్లు.. ఆ రికార్డ్లన్నీ బ్రేక్!