Leo Ramcharan : దళపతి విజయ్ నటించి 'లియో' చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారంటూ ప్రచారం చిన్నగా మొదలై ఇప్పుడు భారీ స్థాయికి చేరుకుంది. రోలెక్స్ తరహాలో కోబ్రా అనే పాత్రలో చరణ్ కనిపిస్తారని పోస్టర్లు కూడా వచ్చాయి. దీంతో అంతా నిజమేనని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. అయితే లియో చిత్రం గురువారం (అక్టోబర్ 19) విడుదల కానుంది. ఇలాంటి సమయంలో చరణ్ ఉన్నారంటూ వచ్చిన ప్రచారం ఇప్పుడు నిజం కాదని తెలిసింది! దీంతో మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి 'లియో' చిత్ర బృందం.. గత కొద్ది రోజులుగా ప్రమోషన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ వరుస ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. కానీ ఆయన ఇంతకాలం ఈ ప్రచారాన్ని అడిషనల్ ప్రమోషన్ కింద భావించారో ఏమో కానీ.. సైలెన్స్ మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చారు. చరణ్ ఉన్నారా లేదా అనే విషయాన్ని ఇన్ని రోజుల పాటు స్పష్టత ఇవ్వకుండా ఉన్నారు. అనవసరంగా మాట్లాడి ఓపెన్ అవ్వడం ఎందుకని ఇతర మూవీటీమ్ కూడా భావించినట్టుంది! అస్సలు ఎవరూ నోరు విప్పలేదు.
ఇప్పుడేమో సినిమాకు ఒక్కరోజు ముందు దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు బాగా నిరాశ చెందుతున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో పేరును వినియోగించుకుని ఫ్రీ పబ్లిసిటీ పొందారంటూ విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇంతకాలం ఈ విషయంపై మేకర్స్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు.
Leo Movie Mega Fans fire : ఒకరంగా మెగా ఫ్యాన్స్ బాధలోనూ అర్థం ఉందనే అనుకోవాలి. ఎందుకంటే లియో మేకర్స్ కూడా ఇంత కాలం దాచి ఉంచి.. ఇప్పుడు ఓపెన్ అయ్యారు. తెలుగులో ఈ చిత్రానికి లోకేశ్-విజయ్ ఇమేజ్‌తో మంచి హైప్ ఉన్నప్పటికీ.. చరణ్ పేరు రావడం వల్ల ఆ హైప్ ఊహించని దానికన్నా పెరిగింది. అందుకే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ అసహనంగా కనిపిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">