ETV Bharat / entertainment

Leo Movie Trailer : ఊహించని రేంజ్​లో పవర్​ఫుల్​గా 'లియో' ట్రైలర్‌.. విజయ్​ వైల్డ్​ యాక్టింగ్​ గూస్​బంప్సే

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 6:50 PM IST

Updated : Oct 5, 2023, 10:51 PM IST

Leo Movie Trailer : దళపతి విజయ్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ చిత్రం 'లియో'. తాజాగా ఈ మూవీ నుంచి పవర్​ఫుల్ ట్రైలర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​.

Leo Movie Trailer : ఊహించని రేంజ్​లో పవర్​ఫుల్​గా  'లియో' ట్రైలర్‌.. విజయ్​ వైల్డ్​ యాక్టింగ్​ అదిరిపోయిందంతే!

Leo Movie Trailer : దళపతి విజయ్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ చిత్రం 'లియో'. కశ్మీర్‌ నేపథ్యంలో సాగే భిన్నమైన కథాంశంతో మాసివ్​​ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోంది. అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా లియో ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రచార చిత్రంలో లియోదాస్‌గా విజయ్‌ యాక్టింగ్​, ఆయనపై చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఈలలు వేయించే రేంజ్​లో ఉన్నాయి. అర్జున్‌ - విజయ్‌లపై షూట్​ చేసిన సీన్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. అనిరుధ్‌ అందించిన బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయంది.

"సీరియల్ కిల్లర్ నడిరోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు.. ఆల్రెడీ రోడ్డు మీద చాలా మంది చనిపోయారు. వాడు చాలా క్రూరుడు.. వాడు అందరిని కాలుస్తున్నాడు.. అప్పుడు దైర్యంగా ఒక పోలీస్​ ఆఫీసర్ సింహంలా వచ్చి ఆ సీరియల్​ కిల్లర్​ను కాల్చాడు. ఇప్పుడు ఆ ఆఫీసర్​ కాల్చిన గన్.. నీ చేతిలో ఉంది.." అని విజయ్ వాయిస్ ఓవర్​తో ట్రైలర్ ప్రారంభం అవ్వగా.. విజువల్స్​ను యాక్షన్​గా అద్భుతంగా చూపించారు.

ఆ తర్వాత కిల్లర్​ను చంపింది పార్దీ(విజయ్) అనుకోని అతడిని విలన్స్ చంపడానికి ప్రయత్నిస్తూ ఉండటం, అయితే కిల్లర్​ను చంపింది తాను కాదని, తనలా ఉన్న మరోడని పార్దీ చెప్పడం సస్పెన్స్​గా చూపించారు. అయినా విలన్లు మాత్రం పార్దీని, అతడి కుటుంబాన్ని వెంబడిస్తూనే ఉండగా.. చేసేదేమిలేక పార్దీ ఎదురుతిరుగడం, ఆ తర్వాత కిల్లర్​ను చంపింది లియో(మరో విజుయ్​) అని తెలవడం జరుగుతుంది. అసలు ఈ లియో ఎవరు.. ? ఎందుకు సీరియల్​ కిల్లర్​ను చంపాడు.. లియో, పార్దీ ఇద్దరు ఒకేలా ఎందుకు ఉన్నారు? అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. అంటే విజయ్ డబుల్ రోల్​లో కనిపించనున్నట్లు హింట్ ఇచ్చారు. మరి నిజంగానే.. లియో, పార్దీ వేరా? లేదా ఇద్దరు ఒకరేనా.. ? అనేది చూడాలి. కాగా, ఈ సినిమా అక్టోబర్ 19న వరల్డ్​ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Oct 5, 2023, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.