ETV Bharat / entertainment

Leo Audio Launch : 'లియో' ఆడియో లాంఛ్​కు 'పొలిటికల్​' ట్విస్ట్​?.. మేకర్స్​ క్లారిటీ ఇలా! - Leo Audio Launch Issue

Leo Audio Launch Cancelled : స్టార్​ కాంబో విజయ్- లోకేశ్​ కాంబినేషన్​లో రాబోతున్న 'లియో' సినిమా ఆడియో లాంఛ్​ రద్దు పట్ల నెట్టింట రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లే ఈవెంట్​ క్యాన్సిల్​ అవ్వడానికి కారణమంటూ వస్తున్న కామెంట్లపై మేకర్స్​ క్లారిటీ ఇచ్చారు.

Leo Audio Launch Cancelled
Leo Audio Launch Cancelled
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 2:07 PM IST

Leo Audio Launch Cancelled : స్టార్​ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్​ దర్శకత్వంలో విజయ్​ హీరోగా తెరకెక్కిన చిత్రం 'లియో'. అక్టోబర్​ 19న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో లాంఛ్​​ ఈవెంట్​పై ఫ్యాన్స్​లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా దీనిపై మూవీ మేకర్స్​ క్లారిటీ ఇచ్చారు. ఆడియో రిలీజ్​ ఫంక్షన్​ను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. అందుకు గల కారణాలను వివరించారు.

  • Considering overflowing passes requests & safety constraints, we have decided not to conduct the Leo Audio Launch.

    In respect of the fans' wishes, we will keep you engaged with frequent updates.

    P.S. As many would imagine, this is not due to political pressure or any other…

    — Seven Screen Studio (@7screenstudio) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"లియా మూవీ ఆడియో రిలీజ్​ ఈవెంట్‌కు భారీగా ఫ్యాన్స్​ వచ్చే అవకాశముంది. అంతమందికి ఎంట్రీ పాస్‌లు ఇవ్వాలంటే కుదరదు. అందుకే భద్రతా కారణాలతో ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం. అభిమానుల కోసం నిరంతరం ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్​లు ఇస్తూనే ఉంటాం. అయితే, అందరూ భావిస్తున్నట్లు మా మీద ఏ రాజకీయ పార్టీ ఒత్తిడి లేదు. మరే ఇతర కారణాలు లేవు" అని ట్వీట్‌ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మేకర్స్​ క్లారిటీ ఇచ్చినా..
Leo Audio Launch Cancelled Or Not : అయితే మేకర్స్​ క్లారిటీ ఇచ్చినప్పటికీ విజయ్​ ఫ్యాన్స్​.. ఈవెంట్​ రద్దుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. విజయ్​ స్పీచ్​ను మిస్​ అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సోషల్​మీడియాలో ఇంటర్వ్యూయేనా ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

Leo Audio Launch Issue : లియో మేకర్స్​ తీసుకున్న నిర్ణయాన్ని ఏజీసీ సినిమాస్​ సీఈవో అర్చన కళాపతి స్వాగతించారు. అభిమానుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్​ రద్దు చేయడాన్ని ప్రశంసించారు. ఆడియో లాంఛ్​ జరగనప్పటికీ.. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్​ ఉంటాయని అంచనా వేశారు.

Leo Movie Cast : 'లియో' విషయానికొస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్​గా నటిస్తోంది. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, 'మాస్టర్' తర్వాత విజయ్ - లోకేశ్​ కాంబినేషన్​లో రాబోతున్న సినిమా కావడం వల్ల ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

లోకేశ్​ సినిమాటిక్ యూనివర్స్​లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విజయ్​కు తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్​ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది.

Vijay Thalapathy Son : డైరెక్టర్​గా ఎంట్రీ ఇవ్వనున్న హీరో విజయ్ కుమారుడు.. ఆ బ్యానర్​లోనే ఫస్ట్ మూవీ

IMDb Top Movies : అటు 'సలార్​'.. ఇటు 'జవాన్​'.. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాప్‌-10 సినిమాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.