Lavanya Tripathi On OTT: ప్రస్తుతం సినిమాలకు దీటుగా వెబ్ సిరీస్‌లు.. నటీనటులకు మంచి పేరు తీసుకొస్తున్నాయి. గత రెండు, మూడేళ్లుగా టాలీవుడ్‌లో వెబ్‌సిరీస్ రూపొందించే ధోరణి పెరుగుతోంది. హీరోహీరోయిన్లు.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు.
![lavanya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15602241_eeeee.jpg)
'అందాల రాక్షసి' సినిమాతో కథానాయికగా పరిచయమైన ఆమె.. జయాపజయాలకు అతీతంగా టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కెరీర్లో తొలిసారి ఆమె ఓ వెబ్‌సిరీస్‌ను అంగీకరించారు. 'పులి మేక' అనే టైటిల్‌తో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతుంది. ఇందులో లావణ్య త్రిపాఠితో పాటు హీరో ఆది లీడ్‌రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ సిరిహనుమంత్, సుమన్, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‌ను 'జీ5 ఓటీటీ' సంస్థతో కలిసి రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌కు ఆస్ట్రాలజీ అంశాలను ముడిపెడుతూ ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.
Vishwak Sen New Movie: ఇటీవలే 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాతో హిట్ అందుకున్న హీరో విశ్వక్సేన్ మంచి జోష్ మీద ఉన్నారు. తాజాగా తన కొత్త సినిమా ప్రకటించారు. అయితే ఈ యువహీరో అదిరే ఛాన్స్ కొట్టేశారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. యాక్షన్ కింగ్‌గా సినీ ప్రియులకు సుపరిచితుడైన హీరో అర్జున్.. విశ్వక్ సేన్ కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
-
Here's the crazy announcement of #VishwakSen11 📢@srfioffl's Production No.15💥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Written, Directed & Produced by
'Action King' @akarjunofficial🎬
🌟ing @VishwakSenActor
& Introducing @aishwaryaarjun in TFI 💃🏻@IamJagguBhai is playing a pivotal role✨
THE JOURNEY BEGINS SOON💫 pic.twitter.com/SZcOE1fhMw
">Here's the crazy announcement of #VishwakSen11 📢@srfioffl's Production No.15💥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 19, 2022
Written, Directed & Produced by
'Action King' @akarjunofficial🎬
🌟ing @VishwakSenActor
& Introducing @aishwaryaarjun in TFI 💃🏻@IamJagguBhai is playing a pivotal role✨
THE JOURNEY BEGINS SOON💫 pic.twitter.com/SZcOE1fhMwHere's the crazy announcement of #VishwakSen11 📢@srfioffl's Production No.15💥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 19, 2022
Written, Directed & Produced by
'Action King' @akarjunofficial🎬
🌟ing @VishwakSenActor
& Introducing @aishwaryaarjun in TFI 💃🏻@IamJagguBhai is playing a pivotal role✨
THE JOURNEY BEGINS SOON💫 pic.twitter.com/SZcOE1fhMw
తెలుగు, తమిళం, కన్నడలో హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అర్జున్. తెలుగులో రవితేజ నటించిన 'ఖిలాడీ' చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. మరో విషయమేమిటంటే.. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తున్నారు. ఆదివారం.. మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. కాగా, ఈ మూవీలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇవీ చదవండి: వారంతా సెట్.. నేనొక్కడినే ఇలా.. హిట్ కొట్టగానే...: హీరో ప్రిన్స్