ETV Bharat / entertainment

Kushi Telugu Review : సామ్​- విజయ్​ 'ఖుషి'.. ఆడియెన్స్​ కనెక్టయ్యారా ? - ఖుషి మూవీ రివ్యూ

Kushi Telugu Review : విజయ్​ దేవరకొండ - సమంత కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే ?

Kushi Telugu Review
Kushi Telugu Review
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 1:16 PM IST

Kushi Telugu Review : చిత్రం: ఖుషి; నటీనటులు: విజయ్‌ దేవరకొండ, సమంత, శరణ్య పొన్నవనన్‌, మురళీశర్మ, రోహిణి, వెన్నెల కిషోర్‌, జయరామ్‌, రాహుల్‌ రామకృష్ణ, సచిన్‌ ఖేడ్కర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు; సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌; ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి; నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌; సినిమాటోగ్రఫీ: మురళి జి; రచన, దర్శకత్వం: శివ నిర్వాణ; విడుదల: 01-09-2023

Kushi Movie Review : రౌడీ హీరో విజయ్​ దేవరకొండ, టాలీవుడ్​ స్టార్​ సమంత నటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మంచి అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉంది? న్యూ ఏజ్‌ డ్రామాగా మెప్పించిందా?

క‌థేంటంటే: విప్ల‌వ్ దేవ‌ర‌కొండ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) గవర్నమెంట్​ ఉద్యోగంపై ఇష్టంతో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌లో జేటీవోగా విధుల్లో చేరతాడు. అంతే కాకుండా ఏరికోరి క‌శ్మీర్‌లో పోస్ట్ వేయించుకుంటాడు. ఇక అక్క‌డే ఆరా బేగం (స‌మంత‌)ను చూసి లవ్​లో ప‌డ‌తాడు. త‌మ్ముడిని వెతుక్కుంటూ తాను పాకిస్థాన్‌ నుంచి వ‌చ్చాన‌ని చెప్పినప్పటికీ.. త‌న కోసం పాకిస్థాన్‌ వెళ్ల‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తాడు విప్ల‌వ్‌. అంత‌గా త‌న‌ని ఇష్ట‌ప‌డ‌టం చూసి... ఆ ప్రేమ‌కు ఆరా కూడా ఫిదా అయిపోతుంది. కానీ, వీళ్ల ప్రేమ‌కు పెద్ద‌లు అడ్డు చెబుతారు. దీంతో భిన్న కుటుంబ నేప‌థ్యాలకు చెందిన ఈ జంట విడిపోవ‌డం ఖాయ‌మ‌ని ఇరు కుటుంబాలూ న‌మ్ముతాయి. మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట... పెద్ద‌లు చెప్పిన‌ట్టే విడిపోయిందా? ఇంత‌కీ వీళ్ల కుటుంబాల క‌థేమిటి? పెళ్లయిన తర్వాత ఈ జంట మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే: ఒక జంట ప్రేమ‌... పెళ్లి జీవితం నేప‌థ్యంలో సాగే స్టోరీ ఇది. లవ్​ స్టోరీల్లో ప్ర‌ధాన సంఘ‌ర్ష‌ణకు ధ‌నిక‌, పేద‌, ప‌రువు, కులం, ప్ర‌తిష్ఠ, మ‌తం వంటి విష‌యాలే ఎక్కువ‌గా కార‌ణ‌మ‌వుతుంటాయి. ఇక ఈ స్టోరీ కూడా ఇంచుమించు అలాంటిదే. కాక‌పోతే ఇందులో ఆస్తికులు, నాస్తికులైన రెండు కుటుంబాల న‌మ్మ‌కాల నుంచి ఆ సంఘ‌ర్ష‌ణ‌ని సృష్టించి క‌థ‌ను న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. తొలి భాగం లవ్​ స్టోరీగా సాగితే, మ‌లిభాగం వైవాహిక జీవితం చుట్టూ సాగుతుంది.

కొత్త నేప‌థ్య‌మే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం. ప్ర‌ధాన పాత్ర‌లు ప‌రిచ‌యం కాగానే... క‌థ క‌శ్మీర్‌కు చేరుతుంది. అక్క‌డ హీరో-హీరోయిన్లు ఒక‌రికొక‌రు తార‌స‌ప‌డ‌టం... ఆ త‌ర్వాత ప్రేమ, విన‌సొంపైన పాట‌లు, క‌నువిందు చేసే క‌శ్మీర్ అందాల‌తో సినిమా హాయిగా సాగిపోతుంది.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ - వెన్నెల కిశోర్ మధ్య కామెడీ సీన్స్​ కూడా ఫస్ట్​హాఫ్​కు ప్ర‌ధాన బ‌లం. సెకెండా​ఫ్​లోనే అస‌లు సంఘ‌ర్ష‌ణ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట మ‌ధ్య ఎలాంటి విష‌యాలు అపార్థాల‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి? ఇక ఆ జంట భిన్న సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లతో మెలిగే కుటుంబాల నుంచి వ‌చ్చిన‌ప్పుడు ఆ అపార్థాలు ఇంకెంత‌గా ప్ర‌భావం చూపిస్తాయో సెకండాఫ్‌లో చూపించారు.

చాలా సినిమాల్లో చూసిన ప్రేమ‌క‌థే అయినా కొత్తర‌క‌మైన నేప‌థ్యాన్ని చూపిస్తూ సంఘ‌ర్ష‌ణ‌, భావోద్వేగాల్ని పండించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఈ క‌థ‌లో పండిన సంఘ‌ర్ష‌ణ మోతాదే స‌రిపోలేదు. అటు ప్రేమ‌కుల‌కు, ఇటు భార్యాభ‌ర్త‌ల‌కీ క‌నెక్ట్ అయ్యే స‌న్నివేశాలు త‌క్కువ‌. ప్ర‌థ‌మార్ధం హాయిగా సాగినా.. ద్వితీయార్ధంలో చాలా చోట్ల స‌న్నివేశాలు సాగ‌దీత‌లా అనిపిస్తాయి. ఫెర్టిలిటీ సెంట‌ర్‌లో హ‌డావుడి, కేర‌ళలో స‌న్నివేశాలు వృథా అనిపిస్తాయి. హీరోయిన్‌కి మిస్ క్యారేజ్ అయ్యాక కూడా హీరోకి టెస్టుల పేరుతో తెర‌పై హ‌డావుడిని చూపించ‌డం అంత‌గా అత‌క‌లేదు.

మరోవైపు హీరో-హీరోయిన్ల మ‌ధ్య అపార్థాలు కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు. ప‌తాక స‌న్నివేశాలతో మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు. కుటుంబంతో క‌లిసి చూసే క‌థే అయినా.. విజ‌య్ దేవ‌ర‌కొండ మార్క్ రొమాంటిక్ స‌న్నివేశాలకీ లోటులేకుండా చూసుకున్నాడు. ముఖ్యంగా.. ఆరాధ్య పాట‌లో విజ‌య్‌, స‌మంత మ‌ధ్య కెమిస్ట్రీ ప్ర‌భావం చూపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: విజ‌య్, సామ్​ జోడీ ప్రతి సన్నివేశంలోనూ ఆక‌ట్టుకుంటుంది. క‌థ‌కు త‌గ్గ ఎంపిక. ప్రేమలో ప‌డిన జంట‌గా ప్ర‌థ‌మార్ధంలో ఎంత అందంగా క‌నిపించారో, ద్వితీయార్ధంలో భార్యాభ‌ర్త‌లుగా ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ప‌తాక స‌న్నివేశాల్లోనూ, అంత‌కుముందు వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ చ‌క్క‌టి భావోద్వేగాల్ని పండించారు.

ఇక స‌చిన్ ఖేడేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ పాత్ర‌లు సినిమాకి కీల‌కం. ఒక‌రు నాస్తికుడిగా, మ‌రొక‌రు ప్ర‌వ‌చ‌న‌క‌ర్త‌గా పాత్ర‌ల్లో నటించారు. జ‌య‌రాం, రోహిణి, శ‌ర‌ణ్య పొన్‌వ‌ణ్నన్‌, ల‌క్ష్మీ, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ పాత్ర‌ల‌కి త‌గ్గ‌ట్టుగా న‌టించారు. ఫస్టాఫ్‌లో వెన్నెల కిశోర్ కొన్ని న‌వ్వులు పంచితే, ద్వితీయార్ధంలో రాహుల్ రామ‌కృష్ణ సందడి చేస్తారు. అలీ, బ్ర‌హ్మానందం, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌ర న‌టులున్నా ఆశించిన స్థాయిలో హాస్యం పండ‌లేదు.

విలన్​ పాత్ర‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించే శ‌త్రుకి ఇందులో విభిన్న‌మైన పాత్ర దొరికింది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌ బ‌లం. హేష‌మ్ పాట‌లు ఎంత బాగున్నాయో, వాటి చిత్రీకరణ కూడా అంతే బాగుంది. ముర‌ళీ కెమెరా క‌శ్మీర్ అందాల్ని, ప్ర‌ధాన జోడీ మ‌ధ్య కెమిస్ట్రీని ఆక‌ట్టుకునేలా చూపించింది. సెకెండాఫ్​లో ఎడిటింగ్ విభాగం మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ తాను న‌మ్మిన ఓ స‌గ‌టు క‌థ‌ని స్ప‌ష్టంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. పాట‌ల‌న్నీ రాసిన ఆయ‌న, క‌థ‌, స్క్రీన్‌ప్లే ర‌చ‌న‌పైన కూడా ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • బ‌లాలు
  • + క‌శ్మీర్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ‌
  • + విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జోడీ
  • + పాట‌లు.. కుటుంబ నేప‌థ్యం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాలు
  • - కొర‌వ‌డిన సంఘ‌ర్ష‌ణ‌
  • చివ‌రిగా: ఖుషి.. విజ‌య్‌, స‌మంత జోడీ షో!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.